Crime News: ప్రియుడి కోసం బరితెగించిన భార్య.. భర్తపై భారీ స్కెచ్.. బలైనా అమాయకురాలు..!

విజయవాడలో భర్తను జైలుకు పంపటానికి ప్రియుడి ప్రవీణ్‌తో కలిసి భార్య మృదుల మర్డర్ ప్లాన్ వేసింది. తన భర్తతో వివాహేతర సంబంధం ఉన్నట్లు బెదిరిస్తే డబ్బులు ఇస్తాం అంటు నాగమణి అనే మహిళతో ఒప్పందం చేసుకుంది. మర్డర్ ప్లాన్ తెలియక ప్రవీణ్ వెంట వెళ్ళిన నాగమణి ప్రాణాలు పోగొట్టుకుంది.

New Update
Crime News: ప్రియుడి కోసం బరితెగించిన భార్య.. భర్తపై భారీ స్కెచ్.. బలైనా అమాయకురాలు..!

Vijayawada: విజయవాడ శివార్లలో దారుణహత్య జరిగింది. రెండురోజుల క్రితం పంటపొలాల్లో అనుమానాస్పద డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేసే క్రమంలో అనుమానాస్పద మృతిని హత్యగా నిర్ధారించారు. అసలేం జరిగిందంటే.. సినీ పక్కిలో మర్డర్ ప్లాన్ వేశారు ప్రేయసి, ప్రియుడు. భర్తను జైలుకు పంపటానికి ప్రియుడితో కలిసి భార్య మర్డర్ ప్లాన్ వేసింది. అయితే, డబ్బులకు ఆశపడి ప్రాణాలు పోగొట్టుకుంది మరో వివాహిత నాగమణి.

లైన్ క్లియర్..

పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న మృదులకు 30 ఏళ్ళ ప్రవీణ్ తో వివాహేతర సంబంధం ఉంది. భర్త ఋషేంద్ర అడ్డుగా ఉండటంతో అతన్ని తప్పించేందుకు పథకం వేసింది భార్య. భర్తపై ఏదైనా హత్య నేరం మోపి జైలు కు పంపితే లైన్ క్లియర్ అవుతుందని మృదుల, ప్రవీణ్ అనుకున్నారు. కొన్నేళ్ళ క్రితం ప్రవీణ్ ఇంట్లో అద్దెకు ఉన్న నాగమణిను హత్య చేసి మృదుల భర్త పై నేరం మోపేందుకు స్కెచ్ వేశారు.

Also Read: ‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్.. మీరు ఓ లుక్కేయండి..!

ఆమెకు తెలియకుండానే..

మృదుల భర్తతో వివాహేతర సంబంధం ఉన్నట్లు బెదిరిస్తే డబ్బులు ఇస్తాం అంటు నాగమణి తో ఒప్పందం చేసుకున్నారు. అయితే, మర్డర్ ప్లాన్ తెలియక ప్రవీణ్ వెంట వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంది. నాగమణిని పెనమలూరు శివారుకు తీసుకుని వచ్చి ఆమె ఫోన్ నుండి మృదుల ఫోన్ కు ఆమె భర్తతో వివాహేతర సంబంధం వుందంటూ వాయుస్ మెసేజ్ లు రికార్డ్ చేసి పంపించాడు ప్రియుడు ప్రవీణ్. మృదుల భర్తే నాగమణిని హత్య చేసినట్లు నాగమణి కే తెలియకుండా ఆమె నుండి ఏవిడెన్స్ క్రియేట్ చేశారు. డబ్బులకు ఆశ పడి వారు చెప్పిన టెక్స్ట్ మెసేజ్ లు, వాయిస్ మెసేజ్ లు పెట్టింది నాగమణి.

రెండు రోజుల్లోనే..

ప్లాన్ ప్రకారం అనుకున్న పని అయ్యాక అక్కడే నాగమణిని హత్య చేశారు. మరుసటి రోజు నాగమణి డెడ్ బాడీ నీ గుర్తించిన పోలీసులు ..అనుమస్పద మృతి కేస్ గా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో షాకింగ్ విషయాలు తెలుసుకున్నారు. భర్త అడ్డు తొలంగించుకోవాలనే ఇలా మర్డర్ ప్లాన్ వేశారని తేలింది. రెండు రోజుల్లో కేస్ ను చేధించి మృదుల, ప్రవీణ్ తో పాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisment
తాజా కథనాలు