Crime News: మహిళ ప్రాణం తీసిన జ్యోతిష్యం పిచ్చి.. ఏమైందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

అంబర్ పేటకు చెందిన బబిత యూట్యూబ్ ఛానల్‌లో పరిచయమైన ఓ జ్యోతిషుడి మాటలు నమ్మి ఆత్మహత్య చేసుకుంది. నీ భర్తకు నువ్వు దూరం అవుతావని చెప్పడంతో ఆందోళనకు గురై తన భర్తకి చెప్పింది. నమ్మొద్దని హెచ్చరించిన మారకపోవడంతో చేయి చేసుకున్నాడు. మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుంది.

Crime News: మహిళ ప్రాణం తీసిన జ్యోతిష్యం పిచ్చి.. ఏమైందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
New Update

Crime News: జ్యోతిష్యం పిచ్చి పచ్చని సంసారంలో చిచ్చుపెట్టింది. యూట్యూబ్ ఛానల్‌ ద్వారా పరిచయమైన ఓ జ్యోతిషుడు నీ భర్తకు నువ్వు దూరం అవుతావని చెప్పడంతో ఆ మహళ ఆందోళన చెందింది. ఆపై ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని అంబర్ పేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

చిచ్చుపెట్టిన జ్యోతిష్యం

హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన బబిత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలరాంను ఐదేళ్ల క్రితం లవ్ మార్యేజ్ చేసుకుంది. కానాజీగూడ ఇందిరానగర్‌లో కాపురం పెట్టింది. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్మే బబిత ఓ యూట్యూబ్‌లో చెప్పిన జ్యోతిష్యాన్ని గుడ్డిగా నమ్మింది. జ్యోతిష్యుడు చెప్పినట్టుగా తాము విడిపోతామని బలంగా నమ్మింది.

Also Read: మీ పిల్లలు స్కూల్ కి వెళ్లి సేఫ్ గా రావాలంటే.. సైబరాబాద్ పోలీసుల 15 టిప్స్!

హెచ్చరించినా మారని బబిత

అయితే, ఇదే విషయాన్ని భర్తతో చెప్పింది. జ్యోతిష్యం గుడ్డిగా నమ్మొద్దని భర్త హెచ్చరించాడు. అయినప్పట్టికి తరచూ ఇదే విషయం చెప్పడంతో ఆమెపై చెయి చేసుకున్నాడు. మనస్తాపానికి గురై బబిత ఆత్మహత్య చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే,
అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

భర్త బలరాంపై దాడి

ఘటనపై సమాచారం అందుకున్న బబిత తల్లిదండ్రులు భర్త బలరాంపై దాడి చేశారు. కట్నం కోసం వేధించడం వల్లే కుమార్తె బబిత ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. అయితే, జ్యోతిష్యాన్ని నమ్మే ఆమె ఆత్మహత్య చేసుకుందని స్థానికులు అంటున్నారు. జ్యోతిష్యాన్ని నమ్మవద్దని భర్త పదేపదే చెప్పిన బబిత మారకుండా ఇదే విషయం ప్రస్తవించేదని ..ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని.. కొపంతో భార్యపై చేయిచేసుకున్నాడని.. ఇలా వివాదం జరగడం వల్ల ఆమె మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

#crime-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe