/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Kamareddy_-A-man-was-brutally-murdered-in-Sirpur.-The-reason-was-extramarital-affair-jpg.webp)
50 Thousand Price : భార్యభర్తల(Wife & Husband) మధ్య మనస్పర్థలు మామూలే. చిన్న చిన్న గొడవలు అనేవి ఒకటి రెండు రోజులు సర్దుకుంటాయి. కానీ ఓ మహిళ(Woman) తనతో భర్తతో గొడవ జరిగిన తర్వాత వాట్సాప్ లో పెట్టిన స్టేటస్ చూసి బంధువులు భయంతో వణికిపోయారు. నా భర్తను చంపిన వారికి రూ. 50వేల రివార్డు(50 Thousand Reward) ఇస్తానంటూ ఆ మహిళ వాట్సాప్ లో స్టేటస్(WhatsApp Status) పెట్టుకుంది. ఈ స్టేటస్ కాస్త వైరల్ గా మారింది. భార్య స్టేటస్ చూసిన భర్త తన భార్య నుంచి ప్రాణహాని ఉందంటూ పరుగెత్తుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనకు తన ఆస్తులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పూర్తి వివరాల ప్రకారం... 2022లో తమ పెళ్లి జరిగిందని.. వివాహం జరిగిన కొద్ది రోజులకే గొడవలు మొదలయ్యాయని సదరు వ్యక్తి పోలీసులకు తెలిపాడు. అప్పటి నుంచి తన భార్య ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటుందని తెలిపారు. ఆ తర్వాతే తనను చంపేందుకు ప్లాన్ చేస్తుందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమ మధ్య వచ్చిన గొడవలకు తన అత్తమామల పక్కింట్లో ఉంటున్న ఓ వ్యక్తి కారణమని పోలీసుల ముందు వాపోయాడు. తన భార్యకు ఆ వ్యక్తితో వివాహేతర సంబంధం(Extramarital Affair) ఉందని అతడు పలుమార్లు తనకు ఫోన్ చేసి చంపుతానంటూ బెదిరించాడని పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి : భారీ వర్షాలకు కూలిన గౌహతి ఎయిర్ పోర్టులో కూలిన పైకప్పు..!