ప్రస్తుత యువ క్రికెటర్లకు అహంకారం ఎక్కువ అని.. ఐపీఎల్ ద్వారా వస్తున్న డబ్బులతో పొగరు కూడా పెరిగిందంటూ ఇటివలి టీమిండియా మాజీ సారధి, 1983 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్(kapil dev) చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టాడు ఆల్‌రౌండర్ జడేజా. కపిల్ దేవ్ ఏ సందర్భంలో ఇలా అన్నారో తనకు తెలియదని.. సోషల్‌మీడియా ఎక్కువగా చూడనంటూ చెప్పుకొచ్చిన జడేజా(jadeja).. హర్యానా హరికేన్ వ్యాఖ్యలను మాత్రం వ్యతిరేకించాడు.
జడేజా ఏం అన్నాడంటే..?
కపిల్ దేవ్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ జడేజా హాట్ కామెంట్స్ చేశాడు. "కపిల్ దేవ్ ఎప్పుడు ఇలా చెప్పారో నాకు తెలియదు. నేను సోషల్ మీడియాలో ఎక్కువ విషయాలు వెతకను. ప్రతి ఒక్కరికి వారి సొంత అభిప్రాయం ఉంటుంది. ప్రస్తుత టీమిండియాలో ప్రతి ఒక్కరూ వారి ఆటను ఆస్వాదిస్తున్నారు.. కష్టపడుతున్నారు. జట్టులో ఆడేందుకు అవకాశం లభించినప్పుడల్లా ప్లేయర్లు 100 శాతం సత్తా చాటుతున్నారు. భారత్‌కు మ్యాచ్‌లు గెలవడానికి ప్రయత్నిస్తున్నారు" అని జడేజా వ్యాఖ్యనించారు. అంతే కాదు..టీమిండియా ఒక్క మ్యాచ్‌లో ఓడిపోగానే ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయని.. ఎవరూ అహంకారంతో ఉండరన్నాడు జడ్డూ. అందరూ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న విషయం మరవద్దన్నాడు. జట్టును గెలిపించడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామని.. ఇక్కడ వ్యక్తిగత ఎజెండా ఎవరికీ లేదంటూ కపిల్ వ్యాఖ్యలను తనదైన శైలిలో వ్యతిరేకించాడు జడేజా.
కపిల్ దేవ్ (PC: Reuters)కపిల్ ఏం అన్నారు?
కపిల్ దేవ్.. ఇటీవల 'ది వీక్'(The WEEK) మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రస్తుత టీమిండియా క్రికెటర్లపై విమర్శలు చేశారు. ఎక్కువ డబ్బులు సంపాదిస్తుండడంతో అహంకారంతో ఉన్నట్లు కనిపిస్తారని.. తమకు అన్నీ తెలుసని భావిస్తున్నారని చెప్పారు. వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ లాంటి ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో ఫామ్‌లో లేనప్పుడు సలహాల కోసం తన వద్దకు వస్తారని ఇటివలే భారత మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలు చేయగా.. అందుకు సపోర్ట్‌గా కపిల్‌దేవ్ ఈ తరహా కామెంట్స్ చేశారు. ఇప్పుడున్న క్రికెటర్లు సీనియర్లను అసలు సలహా అడగరని.. అన్నీ తమకే తెలుసనీ ఫీల్ అవుతారంటూ మండిపడ్డారు. తాజాగా కపిల్ దేవ్ వాదనను టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తోసిపుచ్చాడు. ఇక ఇటివలే వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో జడేజా పలు రికార్డులను బద్దలు కొట్టాడు. వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు . ఇక మూడు వన్డేల సిరీస్‌లో ఆఖరి వన్డే ఇవాళ ( ఆగస్టు 1న) ట్రినిడాడ్‌లోని తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో జరగనుంది. భారత్ కాలమానం ప్రకారం సాయంత్రం 7గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఎవరూ అహంకారంతో ఉండరు..లెజెండరీ క్రికెటర్‌పై జడేజా హాట్ కామెంట్స్..!
ప్రస్తుత టీమిండియా క్రికెటర్లకు అహంకారం ఎక్కువంటూ ఇటివలి టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలను స్టార్ ఆల్‌రౌండర్ జడేజా తోసిపుచ్చాడు. అందరూ దేశం కోసమే ఆడుతున్నారని.. వ్యక్తిగత ఎజెండా ఎవరికీ లేదంటూ కపిల్ చేసిన విమర్శలను వ్యతిరేకించాడు. ఒక్క మ్యాచ్ ఓడిపోగానే ఇలాంటి విమర్శలే వినిపిస్తాయని.. కానీ ఇందులో నిజం లేదన్నాడు ఈ స్టార్ ఆల్‌రౌండర్.
ప్రస్తుత యువ క్రికెటర్లకు అహంకారం ఎక్కువ అని.. ఐపీఎల్ ద్వారా వస్తున్న డబ్బులతో పొగరు కూడా పెరిగిందంటూ ఇటివలి టీమిండియా మాజీ సారధి, 1983 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్(kapil dev) చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టాడు ఆల్‌రౌండర్ జడేజా. కపిల్ దేవ్ ఏ సందర్భంలో ఇలా అన్నారో తనకు తెలియదని.. సోషల్‌మీడియా ఎక్కువగా చూడనంటూ చెప్పుకొచ్చిన జడేజా(jadeja).. హర్యానా హరికేన్ వ్యాఖ్యలను మాత్రం వ్యతిరేకించాడు.
జడేజా ఏం అన్నాడంటే..?
కపిల్ దేవ్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ జడేజా హాట్ కామెంట్స్ చేశాడు. "కపిల్ దేవ్ ఎప్పుడు ఇలా చెప్పారో నాకు తెలియదు. నేను సోషల్ మీడియాలో ఎక్కువ విషయాలు వెతకను. ప్రతి ఒక్కరికి వారి సొంత అభిప్రాయం ఉంటుంది. ప్రస్తుత టీమిండియాలో ప్రతి ఒక్కరూ వారి ఆటను ఆస్వాదిస్తున్నారు.. కష్టపడుతున్నారు. జట్టులో ఆడేందుకు అవకాశం లభించినప్పుడల్లా ప్లేయర్లు 100 శాతం సత్తా చాటుతున్నారు. భారత్‌కు మ్యాచ్‌లు గెలవడానికి ప్రయత్నిస్తున్నారు" అని జడేజా వ్యాఖ్యనించారు. అంతే కాదు..టీమిండియా ఒక్క మ్యాచ్‌లో ఓడిపోగానే ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయని.. ఎవరూ అహంకారంతో ఉండరన్నాడు జడ్డూ. అందరూ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న విషయం మరవద్దన్నాడు. జట్టును గెలిపించడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామని.. ఇక్కడ వ్యక్తిగత ఎజెండా ఎవరికీ లేదంటూ కపిల్ వ్యాఖ్యలను తనదైన శైలిలో వ్యతిరేకించాడు జడేజా.
కపిల్ ఏం అన్నారు?