Jaundice: కామెర్లు చాలా సాధారణ వ్యాధి. ఈ వ్యాధి అన్ని వయసుల వారికి సంభవించవిస్తుంది. ముఖ్యంగా పిల్లలు దీనికి ఎక్కువగా భాదితులు అవుతుంటారు. సహజంగా కామెర్లు వస్తే ముఖం, కళ్ళు, మూత్రం రంగు పసుపు రంగులోకి మారుతాయి. అంతే కాదు చర్మం పై దురద, ఆకలిగా లేకపోవడం, వాంతులు, వంటి సమ్యలు ఉండే అవకాశం ఉంటుంది. జాండిస్ లక్షణాలు ప్రధానంగా చర్మం పై కనిపిస్తాయి. అయితే కామెర్లు సోకినప్పుడు చర్మం పసుపు రంగులోకి ఎందుకు మారుతుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము..
పసుపు రంగులోకి మారే చర్మం..?
నిపుణుల అధ్యయనాల ప్రకారం కామెర్లు సోకితే చర్మం, కళ్ళలోని తెల్లటి భాగం పసుపు రంగులోకి మారుతాయి. శరీరంలో అధిక స్థాయి బిలిరుబిన్ ఉత్పత్తి అయినప్పుడు ఇలా జరుగుతుంది. సాధారణంగా లివర్ ఈ వ్యర్థ పదార్థాన్ని రక్తం నుంచి ఫిల్టర్ చేస్తుంది.. కానీ ఇది అధిక స్థాయిలో ఉత్పత్తి అయినప్పుడు దాన్ని ప్రాసెస్ చేయడం కష్టంగా మారుతుంది. దీంతో బిలిరుబిన్ స్థాయిలు పెరిగి.. చర్మం, కళ్ళు, గోర్లు పసుపు రంగులోకి మారుతాయి.
కామెర్లు ఎందుకు రావచ్చు?
మెడికల్ సైడ్ ఎఫక్ట్స్ , కిడ్నీ స్టోన్స్, అతిగా మద్యం సేవించడం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, సిర్రోసిస్-హెపటైటిస్ లాంటి కాలేయ వ్యాధుల కారణంగా కూడా కామెర్లు బారిన పడే అవకాశం ఉంటుంది. జాన్డీస్ భాదితులు అలసట, కడుపు నొప్పి, బరువు తగ్గడం, వాంతులు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడతారు. శిశువులలో ఈ పరిస్థితి మెదడు దెబ్బతినడానికి కూడా కారణమవుతుంది. కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే కామెర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా కామెర్లు వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం.
Also Read: Health tips: ఏంటీ ఊరికే ఏదో ఒకటి తినాలనిపిస్తుందా.. అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్లే..!