Trees : రోడ్డు పక్కన ఉన్న చెట్లకు తెల్ల రంగు ఎందుకు పూస్తారో తెలుసా?

రోడ్ల వెంబడి నాటిన చెట్లకు తెలుపు రంగు పెయింట్ వేయడం మీరు చూసే ఉంటారు. మరి ఈ రంగు వేయడం వెనుక ఏదైనా కారణం ఉందా? లేదంటే జస్ట్ మార్కింగ్ మాత్రమేనా? వివరాల కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Trees : రోడ్డు పక్కన ఉన్న చెట్లకు తెల్ల రంగు ఎందుకు పూస్తారో తెలుసా?

White Color : సాధారణంగా రోడ్డు పక్కన ఉన్న చెట్ల కాండానికి తెల్లటి పెయింట్‌ మనం చూస్తూ ఉంటాం. ఇలా ఎందుకు వేస్తారనే సందేహం వస్తూ ఉంటుంది. తెలుపు రంగు పెయింట్ ప్రధానంగా మొక్కలను రక్షించడానికి ఉపయోగిస్తారు. సున్నం సాధారణంగా రోడ్డు పక్కన చెట్ల(Road Side Trees) కు పెయింట్ చేయడానికి ఉపయోగిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం చెట్టుకు సున్నం పూస్తే చెట్టు యొక్క బెరడు పగుళ్లు ఏర్పడదు. ఇది చెట్టు కాండాన్ని బలపరుస్తుంది. సున్నంతో పెయింట్ చేసినప్పుడు యొక్క మూలానికి చేరుకుంటుంది.

సున్నం కారణంగా కీటకాలు చెట్టు వేర్లపై దాడి చేయలేవు. ముఖ్యంగా చెదపురుగులు దరిచేరవు. ఇది మొక్క జీవిత కాలాన్ని(Life Span) పెంచుతుంది. చెట్టు బయటి పొరకు రక్షణను అందిస్తుంది. కార్నెల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల ప్రకారం చెట్టుకు తెల్లటి పెయింట్ చేయడం వల్ల నేరుగా సూర్యకాంతి వల్ల చెట్టు దెబ్బతినే అవకాశాలను తగ్గిస్తుంది.

దాని తెలుపు రంగు కారణంగా చెట్టు ట్రంక్‌కు తక్కువ నష్టం ఉంటుంది. చెట్టుకు తెల్లగా రంగు వేయడం వెనుక మరో కారణం కూడా ఉంది. రోడ్డుపక్కన నాటిన చెట్లకు తెలుపు రంగు ఉండడంతో ఈ చెట్లు అటవీశాఖ పర్యవేక్షణలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులెవరూ ఈ చెట్లను నరికివేయలేరు.

Also Read: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ‘జాతిరత్నాలు’ బ్యూటీ.. మాస్‌ మసాలా కావాలంటోంది!

Advertisment
Advertisment
తాజా కథనాలు