Relationship: చాలా మంది మహిళలు భావప్రాప్తి పొందినట్టు నటిస్తారు..ఎందుకంటే!

శృంగారం సమయంలో చాలా మంది మహిళలు భావప్రాప్తి పొందినట్లు నటిస్తారని నివేదికలు చెబుతున్నాయి. చాలా మంది మహిళలు శృంగార సమయంలో ఆందోళనకు గురవుతారు. భావప్రాప్తి అంతరానికి ప్రధాన కారణం మహిళలు శృంగార పరంగా తమ భాగస్వామితో మాట్లాడలేకపోవడం.

New Update
Relationship: చాలా మంది మహిళలు భావప్రాప్తి పొందినట్టు నటిస్తారు..ఎందుకంటే!

ఫోర్‌ప్లే అన్నది శృంగారంలో అన్నిటికంటే ఇంపార్టెంట్‌. స్త్రీ ఆనందం విషయానికి వస్తే, సుమారు 60 శాతం మంది మహిళలకు భావప్రాప్తి ఉండదని నివేదికలు చెబుతున్నాయి. క్లీవ్ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం, కేవలం 10 శాతం మంది మహిళలు మాత్రమే మొదటి నిమిషం ఉద్వేగాన్ని అనుభవిస్తారు. మరో 90 శాతం మంది మహిళలు ఫోర్ ప్లే తర్వాత భావప్రాప్తిని అనుభవిస్తారు.

స్త్రీలు భావప్రాప్తి పొందకపోవడానికి కారణాలు:
ఆందోళన:
అమెరికాలోని ఇండియానాలోని వాల్పరైసో యూనివర్సిటీ 2018లో ఓ సర్వే నిర్వహించింది. ఇందులో చాలా మంది మహిళలు శృంగార సమయంలో ఆందోళనకు గురవుతారని తెలిసింది.

సామాజిక అంశం:
శృంగారం సమయంలో పురుషులకు ఒకసారి మాత్రమే క్లైమాక్స్ ఉంటే స్త్రీలు మాత్రం చాలాసార్లు ఉద్వేగానికి లోనవుతారు. ఇతర దేశాలలో స్త్రీలు శృంగారంలో చాలాసార్లు ఈ దశకు చేరుకుంటారు కానీ భారత్‌లో 70శాతం కంటే ఎక్కువ మంది మహిళలు నకిలీ భావప్రాప్తి పొందుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. దీని వెనుక చాలా కారణాలు ఉండగా.. వాటిలో అతిపెద్దది సామాజిక అంశం. భావప్రాప్తి అంతరానికి ప్రధాన కారణం మహిళలు శృంగార పరంగా తమ భాగస్వామితో మాట్లాడలేకపోవడం. లైంగికంగా చురుకుగా ఉన్న తర్వాత కూడా బెడ్ పై తమకు నచ్చినవి, ఇబ్బంది పెట్టే వాటి గురించి తమ ఇష్టాయిష్టాలను చెప్పుకోలేకపోతున్నారు. భారతీయ మహిళల్లో లైంగిక సంక్షోభానికి ఈ విషయమే ప్రధాన కారణం.

అనోర్గాస్మియా:
భావప్రాప్తికి మరొక కారణం అనోర్గాస్మియా. చాలాసార్లు భార్యాభర్తల మధ్య అవగాహన లోపం వల్ల స్త్రీకి అనార్గాస్మియా కూడా వస్తుంది. శస్త్రచికిత్సల తర్వాత కూడా ఇది జరగడం ప్రారంభమవుతుంది. యాంటీ డిప్రెసెంట్స్ లాంటి కొన్ని మందులు తీసుకునే మహిళల్లో కూడా అనోర్గాస్మియా అభివృద్ధి చెందుతుంది. అనోర్గాస్మియా ఒక వ్యాధి కాదు.. అనేక భావోద్వేగ కారణాల వల్ల వచ్చే సమస్య. భర్తతో ఓపెన్‌గా ఈ విషయాల గురించి మాట్లాడితే ఈ సమస్య సాల్వ్ అవుతుంది.

Also Read: సరిహద్దులో ఉద్రిక్తతల వేళ.. మరోసారి క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

Advertisment
Advertisment
తాజా కథనాలు