మన దేశంలో టమాటాతో లేని వంట గదిని ఊహించుకోలేం. టమాటాలతో డిష్‌లు, చట్నీలు, సాస్‌లు, సలాడ్స్ ప్రిపేర్ చేస్తుంటారు. ఇతర కూరల్లో కూడా వీటిని యాడ్ చేసుకోవచ్చు.ఇది కేవలం వంటల రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. టమాటలో ఉండే పోషకాలు హెల్త్‌కి చాలా మంచివి. వర్షాకాలంలో వీటిని తప్పక తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజువారీ డైట్‌లో టమాటను మిస్ చేయొద్దని సూచిస్తున్నారు.
టమాట తింటే బరువు తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా టమాట జ్యూస్ తాగితే బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీంతో అధిక కొలెస్ట్రాల్ కలిగిన పేషంట్లకు ఇది ఓ రెమెడీగా పనిచేస్తుంది. అలాగే జీర్ణ సమస్యలు పరిష్కారమవుతాయి. టమాటల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో మలబద్దకం, విరేచనాల సమస్యలు ఉండవు.
టమాటలో విటమిన్ C, బీటా కెరోటిన్, ఫీనోలిక్ కాంపౌండ్స్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తాయి. ఇవి క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ముప్పును తగ్గిస్తాయి. ప్రధానంగా, కొలన్, ప్రొస్టేట్, లంగ్ క్యాన్సర్‌లను ఇది అడ్డుకుంటుంది. మరోవైపు, టమాట తింటే కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కెరోటిన్, లైకోపిన్ కంటి చూపును మెరుగు పరుస్తాయి.
గుండె ఆరోగ్యానికి టమాటలు మంచివి. టమాటల్లో లైకోపీన్ అనే పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ముప్పును తగ్గిస్తాయి. బీపీని తగ్గించే లక్షణాలు ఇందులో ఉండటంతో బీపీ, డయాబెటిస్, హార్ట్ పేషంట్లు టమాటను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
టమాట ఇమ్యూనిటీ సిస్టమ్‌ను బూస్ట్ చేస్తుంది. ముఖ్యంగా, ఇందులో ఉండే విటమిన్ C ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. అంతేగాకుండా, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది. వర్షాకాలంలో టమాటలను తింటే మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చు. రక్తం తక్కువగా ఉన్నవారు, అనీమియా వంటి రక్తహీనత వ్యాధులు ఉన్నవారు వీటిని తరచుగా డైట్‌లో యాడ్ చేసుకోవాలి.