అటు ఎన్డీయే ఇటు ప్రతిపక్షాల భేటికి కేవలం జనసేనకు మాత్రమే ఎందుకు ఆహ్వానం అందింది..?

తెలుగురాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైసీపీ, బీఆర్‌ఎస్‌ను అటు ఎన్డీయే, ఇటు ప్రతిపక్ష కూటమి పార్టీలు తమ భేటీలకు పిలవకపోవడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కి కాంగ్రెస్‌,బీజేపీ రెండు ప్రత్యర్థులగానే ఉండగా..ఏపీలో వైసీపీ కేంద్రంలో బీజేపీకి సైలెంట్ సపోర్ట్ ఇస్తుంటుందన్న ప్రచారం ఉంది.

New Update
TS, AP Lok Sabha Seats: తెలంగాణ, ఏపీకి కేంద్రం భారీ షాక్.. భారీగా తగ్గనున్న ఎంపీ సీట్లు.. ఎన్నంటే?

ఇటు ఎన్డీయే అటు ప్రతిపక్షాల భేటీకి తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం జనసేనకు మాత్రమే ఎందుకు ఆహ్వానం అందిందన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇది పవన్‌ పవర్‌గా ఆయన ఫ్యాన్స్‌ అభివర్ణిస్తుండగా.. ఎన్డీయే, ప్రతిపక్షాల లెక్కలు మాత్రం వేరే ఉన్నట్టు క్లియర్‌కట్‌గా తెలుస్తోంది. ఇంతకీ పవన్‌ ఒక్కడికే ఎందుకు ఆహ్వానం అందింది..? ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను ఏ పక్షమూ కూడా ఎందుకు ఇన్‌వైట్ చేయలేదు..? రెండు కూటములు ప్లాన్‌ ఏంటి..?

publive-image జగన్(ఫైల్), మోదీ(ఫైల్), కేసీఆర్(ఫైల్)

తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్కడు:
వచ్చే సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తున్నాయి. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎన్డీయే అఖండ విజయం సాధించింది. మిత్రపక్షాలతో పని లేకుండానే బీజేపీ సోలోగా మెజార్టీ మార్క్‌ దాటింది. 2014సార్వత్రిక ఎన్నికల కంటే ఓట్ల శాతాన్ని, సీట్ల సంఖ్యను పెంచుకుంది. అయితే రానున్న ఎన్నికల్లో బీజేపీ ఆ దిశగా హిస్టరీ రిపీట్ చేస్తుందా అన్నదానిపై ఇప్పటికైతే క్లారిటీ లేదు కానీ..కాంగ్రెస్‌ కాస్త బలపడిందన్న మాట మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది. అందుకే ఎన్డీయే కూడా రిస్కులకు పోకుండా మిత్రపక్షాలను కలుపుకునే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. తెలుగురాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను పక్కనపెట్టి మరీ తమ పార్టీతో పొత్తులో ఉన్న జనసేనకు ఆహ్వానం పంపింది. టీడీపీని నేరుగా పిలవకుండా..ఎన్నికల వరకు సస్పెన్స్‌ మెయింటైన్‌ చేసేలాగా బీజేపీ ఈ విధంగా ఆలోచించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎలాగో టీడీపీ-బీజేపీ-జనసేన కలిపే పోటి చేస్తాయని.. ముందునుంచే చంద్రబాబును పిలవడం ఎందుకుని భావించినట్టుగా తెలుస్తోంది. అందులోనూ 2018 తర్వాత బీజేపీని చంద్రబాబు విపరీతంగా టార్గెట్‌ చేశారని..అందుకే పవన్‌ ఒక్కడిని పిలిస్తే చాలు అని ఎన్డీయే భావించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ రెండు పార్టీలను ఎందుకు పిలవలేదంటే..?
నిజానికి అధికారంలో ఉన్న పార్టీలకు ఎక్కువ వెయిటేజీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అందులోనూ వైసీపీ ఎంపీల బలం ఎక్కువ. ఇటు బీఆర్‌ఎస్‌ది కూడా తక్కువేమీ కాదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలను పిలవకూడదని అటు ఎన్డీయే, ఇటు ప్రతిపక్ష కూటమి పార్టీలు నిర్ణయించుకోవడం వెనక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.

కేసీఆర్‌ని ఎందుకు ఆహ్వానించలేదంటే..?
ప్రస్తుతం తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పరిస్థితి గతానికి భిన్నంగా ఉంది. జీహెచ్‌ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీనే నంబర్‌-2 పార్టీగా అంతా భావించారు..అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ తిరిగి తన నంబర్‌2 స్థానానికి వచ్చేసిందని..బీజేపీ నంబర్‌-3కి పడిపోయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటు బీఆర్‌ఎస్‌ సైతం గతంలో బీజేపీని విమర్శించినంతగా ఇప్పుడు టార్గెట్ చేయడంలేదని.. కాంగ్రెస్‌వైపే విమర్శల బాణాలు ఎక్కుపెడుతుందంటున్నారు విశ్లేషకులు. దీంతో బీఆర్‌ఎస్‌ అటు బీజేపీ మిత్రపక్షాల భేటీకి కానీ.. కాంగ్రెస్‌ మిత్రపక్షాల మీటింగ్‌కి కానీ వెళ్లలేని పరిస్థితుల్లో ఉండిపోయింది.

జగన్‌ని ఎందుకు పిలవలేదంటే..?
మరోవైపు ఏపీలో వైసీపీ ప్రభుత్వానిది మరో భిన్న పరిస్థితి. లోక్‌సభ, రాజ్యసభల్లో బీజేపీ ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు దాదాపు వైసీపీ సపోర్ట్ ఇస్తుంటుంది. నేరుగా ఈ ఇద్దరి మధ్య సయోధ్య లేనట్టే ఉన్నా.. వెనక నుంచి మాత్రం కేంద్రం చెప్పిన మాటను వైసీపీ ఫాలో అవుతుందంటారు విశ్లేషకులు. ఇటివలి ఏపీకి వచ్చిన కేంద్ర మంత్రులు వైసీపీపై విమర్శలు గుప్పించినా..ఆ తర్వాత మళ్లీ ఆ సీన్స్‌ ఎక్కడా కనపడలేదు..మరోవైపు కేంద్రం ఇప్పటికే జనసేనతో పొత్తులోనే ఉండగా..టీడీపీ విషయంలో మౌనం పాటిస్తోంది. పార్లమెంట్‌లో బీజేపీ బిల్లులకు వైసీపీ ప్రతిసారి మద్దతు ఇవ్వడంతో అటు ప్రతిపక్ష పార్టీల కూటమి ఎలాగో జగన్‌ని పిలిచే అవకాశం లేదు..ఇటు వైసీపీని నేరుగా పిలుస్తే పొత్తులో ఉన్న జనసేన అంగీకరించదు..అందుకే అసలు పిలవకపోతే ఏ గోలా ఉండని బీజేపీ భావించినట్టు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు