Women Reservation Bill: ఇన్ని సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఆగిపోయింది..?

ఇప్పడు దేశమంతా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించే చర్చ జరుగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఉమెన్ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లుకు సంబంధించిన కీలక విషయాలపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.

New Update
Women Reservation Bill: ఇన్ని సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఆగిపోయింది..?

Women Reservation Bill: ఇప్పడు దేశమంతా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించే చర్చ జరుగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఉమెన్ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లుకు సంబంధించిన కీలక విషయాలపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కేటాయించాలని పోరాటం జరుగుతూనే ఉంది. అయితే ఈ బిల్లును తొలిసారిగా 1996లోనే అప్పటి దేవెగౌడ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుకు ఆమోదం లభించలేదు. ఇక అప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ బిల్లును ఆమోదించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 2010లో యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం తెలపడంలో విజయం సాధించినా యూపీఐ కూటమిలోని సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడంతో లోక్‌సభలో మాత్రం వీగిపోయింది.

publive-image

హెచ్‌డీ దేవెగౌడ ప్రభుత్వం తొలిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అప్పుడు 13 పార్టీల కూటమితో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉంది. జనతాదళ్, మరికొన్ని పార్టీల నేతలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆగిపోయింది. దీంతో 31 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో ప్రస్తుత బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో కేవలం ఎస్సీ, ఎస్టీ మహిళలకే రిజర్వేషన్లు కల్పించడం ఆమోదయోగ్యం కాదని ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

publive-image

1997లో మరోసారి కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే ఈసారి అనూహ్యంగా అధికార కూటమిలోని పార్టీలే ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఈ సందర్భంగా శరద్ యాదవ్ ప్రసంగిస్తూ పర్కతి మహిళాన్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పట్టణ ప్రాంతాల్లోని పొట్టి జుట్టు ఉన్న మహిళలు మాత్రమే ఈ బిల్లు ద్వారా ప్రయోజం పొందుతారన్నారు. అలాంటి వ్యక్తులు గ్రామాల్లో నివసించే మహిళలకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తారని ప్రశ్నించారు. దీంతో ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి.

publive-image

ఇక 1998లో ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు అయితే ఈ బిల్లుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభ జరుగుతుండగానే ఆర్జేడీ ఎంపీ సురేంద్రప్రసాద్ యాదవ్ అప్పటి లోక్‌సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి నుంచి బిల్లు ప్రతులను లాక్కుని మరీ ముక్కలు ముక్కలు చేశారు. ఇదే సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మరోసారి వాగ్వాదం జరిగింది. నిరసన వ్యక్తం చేస్తున్న సమాజ్‌వాద్ ఎంపీ దరోగా ప్రసాద్‌ను ప్రస్తుత పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాలర్ పట్టుకుని కొట్టి సభ నుంచి గెంటేశారు.

publive-image

అలాగే 2002, 2004, 2008, 2010లోనూ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చే ప్రయత్నాలు జరిగాయి. అయినా కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడమే కాకుండా రెండు సభల్లో బిల్లుకు ఆమోదం లభించే దిశగా అడుగు దూరంలో నిలిచింది.

ఇది కూడా చదవండి: మహిళా సాధికారత కోసం కట్టుబడి ఉన్నాం-రాజ్యసభలో ప్రధాని కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు