Dogs Run With Cars: కారు వెంట కుక్కలు ఎందుకు పరుగెత్తుతాయి?

మనం సాధారణంగా బైక్‌ లేదా కారులో వెళ్తుంటే ఉన్నట్టుండి రోడ్డుపక్కన పడుకుని ఉన్న కుక్కలు ఒక్కసారిగా లేచి మన వాహనం వెంటపడటం చూస్తూ ఉంటాం. అయితే కారులో ఏదైనా మాంసం పదార్థాలు తీసుకెళ్తున్నా కూడా కుక్కలు వెంటపడతాయని చెబుతున్నారు.

Dogs Run With Cars: కారు వెంట కుక్కలు ఎందుకు పరుగెత్తుతాయి?
New Update

Dogs Run With Cars: అలా కుక్కలు వెంటపడగానే వాహనాలను వేగంగా పోనిస్తూ వాటి బారి నుంచి తప్పించుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఇలా స్పీడ్‌గా వెళ్లడం వల్ల యాక్సిడెంట్ల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. మనం వెళ్తున్నకొద్దీ శునకాలకు మరింత కోపం వచ్చి అవి కూడా మనవెంట పరుగు లంకించుకుంటాయి. అలా కొన్ని కిలోమీటర్ల పాటు వెనుక వస్తూనే ఉంటాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక సతమతమవుతాం. అయితే శునకాలు ఇలా అరుస్తూ వాహనాల వెంట పరుగులు తీయడానికి కొన్ని కారణాలు ఉన్నాయని అంటున్నారు.
ఇది కూడా చదవండి: గ్రీన్‌ యాపిల్‌తో గుండె జబ్బులు పరార్‌
ఎక్కువశాతం ప్రయాణ సమయాల్లో వీధికుక్కలు వెంటపడుతూ ఉంటాయి. అసలు కుక్కలు ఎందుకు ఇలా వెంటపడతాయనేది మనకు ఓ మిస్టరీలా అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలపై కొందరు పరిశోధనలు కూడా చేస్తున్నారు. కొత్తవారు కనిపిస్తేనో.. లేక మన మీద కోపంతోనో కుక్కలు వెంటపడుతాయని అనుకుంటూ ఉంటాం. కానీ అసలు కారణం వేరే ఉందంటున్నారు నిపుణులు. వీధికుక్కలు వాహనాల వెంటపడేందుకు ఒక ముఖ్యమైన కారణం ఉంది. మన వాహనాలపై ఇది వరకు ఏదైనా శునకాలు మూత్రం పోసి ఉంటే ఆ వాసన రావడమే కారణం అంటున్నారు. సాధారణంగా రోడ్డు పక్కల లేదా మన ఇంటి దగ్గర పార్క్‌ చేసి ఉన్న వాహనాలపై వీధికుక్కలు మూత్రం చేయడం సర్వసాధారణం. ఆ కుక్కలు సైతం పక్కన ఉన్న ప్రాంతాలను వాసన చూసి మరీ మూత్రం పోసేందుకు మన వాహనాల టైర్లనే ఎంచుకుంటాయి.
కారు టైర్ల కెమికల్‌ వాసన శునకాలకు చిరాకు
అయితే ఇతర కుక్కల మూత్రం వాసనను శునకాలు ఎంత దూరం నుంచి అయినా పసిగడతాయని అంటున్నారు. దీంతో మన వాహనాలు వాటికి దూరంగా వెళ్తున్నప్పుడు ఆ శునకాలు కొద్ది కొద్దిగా మెల్లగా దగ్గరికి వస్తాయి. అలా మన దగ్గరికి రాగానే వాసన ఎక్కువ కావడంతో దాదాపు దాడి చేసినంత పని చేస్తాయి. అలా ఎంతదూరం వెళ్లినా మన వాహనం వెనకాలే వస్తుంటాయి. అయితే ఇతర శునకాల మూత్రం వాసన రావడంతో ఇలా వెంబడించడానికి ఒక కారణం ఉందంటున్నారు. ప్రతి శునకం అది ఉన్న ఏరియాను తన కంట్రోల్‌లోనే ఉందని భావిస్తూ ఉంటుంది. ఇతర కుక్కలను అది ఉన్న ప్రదేశానికి రావడానికి అస్సలు ఒప్పుకోవు. అలా వాహనాల నుంచి వచ్చే మూత్రం వాసనతో వేరే కుక్కలు తమ ప్రాంతానికి వచ్చాయనో లేదా ఆ వాహనంలో కుక్కలు వెళ్తున్నాయన్న అనుమానంతో అలా వెంటపడతాయని అంటున్నారు. అంతేకాకుండా కారులో ఏదైనా మాంసం పదార్థాలు తీసుకెళ్తున్నా కూడా అలాగే వెంటపడతాయని చెబుతున్నారు. మరికొందరు అయితే కారు టైర్ల కెమికల్‌ వాసన శునకాలకు చిరాకు తెప్పిస్తుందని చెప్పుకొస్తున్నారు.

#run-after-cars #dogs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి