Bhogipallu: పిల్లలకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు..తప్పనిసరిగా పోయాలా?

రేగుపండ్లను చిన్నారుల తలపై పోస్తే నర దిష్టి తొలగిపోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారట. పిల్లల తలపై రేగి పండ్లను పోయడం వలన వారికి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

New Update
Bhogipallu: పిల్లలకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు..తప్పనిసరిగా పోయాలా?

Bhogipallu: తెలుగు రాష్ట్రాల్లో సంకాంత్రి పండుగ అంగరంగవైభవంగా జరుపుకుంటున్నారు. మూడే రోజుల ఘనంగా జరుపుకునే పండగలో మొదటి రోజు భోగి, 2వ రోజు మరకసంక్రాంతి,3వ రోజు కనుమను చేసుకుంటారు. ఈ రోజున తెల్లవారుజామునే భోగిమంటలను వేసి ఆటలు, పాటల కార్యక్రమాలను నిర్వహిస్తారు. అంతే కాదు భోగి సందర్భంగా ఆనాడు సాయంత్రం చిన్నారుల తలపై భోగిపండ్లు పోసే సంప్రదాయం ఉంది. అసలు ఇలా ఎందుకు చేస్తారో..!! ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలకు మేధస్సు పెరుగుతుంది:

భోగి పండుగ రోజున ఉదయాన్నే భోగిమంటలు వేస్తారు. ఓ వైపు భోగిమంటలు సంబురాలు జరుపుకుంటే.. మరోవైపు అదేరోజు సాయంత్ర సమయంలో చిన్నారుల తలపై తల్లిదండ్రులు, ముత్తైదువులు భోగిపండ్లను పోసి ఆశీర్వదిస్తారు. ఈ పండ్లను 12 ఏళ్ల చిన్నారుల తలపై పోస్తారు. రేగుపండ్లను చిన్నారుల తలపై పోస్తే నర దిష్టి తొలగిపోతుందని, ఆయురారోగ్యాలతో ఉంటారని వేద పండితులు అంటున్నారు.అంతేకాదు పిల్లల తలపై రేగి పండ్లను పోయడం వలన పిల్లలకు మేధస్సు పెరుగుతుంది నమ్మకం. భోగి పండ్లను గుప్పిట నిండా తీసుకుని పిల్లలచుట్టూ మూడుసార్లు తిప్పి వాళ్ల తల మీద పోస్తారు. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. తల మీద పోయడం వల్ల పిల్లలకి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. భోగిపండ్లు పోసిన రేగి పండ్లను ఎవరూ తినరు.

కష్టాలకు ముగింపు పలుకుతూ..

ఎరుపు రంగులో ఉండే రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా కోలుస్తారు. శివయ్య అనుగ్రహం చేసుకోవడానికి నర, నారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తుండగా.. వారి తలల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారని పురాణ కథలు చెబుతున్నాయి. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం కొనసాగుతుంది. అలా ఆదిత్యుడి ఆశీస్సులు చిన్నారులకు లభిస్తాయని భోగిపండ్లు పోస్తారు. దీంతో పాటు పెద్ద పండుగకు ముందురోజు వచ్చే భోగి వ్యవసాయదారులకు ప్రధానం. సంక్రాంతి వేళ పంటలు చేతికొచ్చి.. పల్లెలు ధనధాన్యరాశులతో కలకలగా ఉంటుంది. గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు పలుకుతూ ‘భోగి’తో భోగభాగ్యాలు ప్రసరించాలని రైతులు కోరుకుంటారు.

ఇది కూడా చదవండి: టీనేజర్ల ఆత్మహత్యలకు కారణమేంటి?..అధ్యయనాలు ఏమంటున్నాయి?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు