నర్సు కాదు.. నరరూప రాక్షసి..ఏకంగా ఏడుగురి శిశువుల్ని క్రూరంగా చంపేసింది!

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతో నర్సులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయరు.. కానీ బ్రిటన్‌కి చెందిన లూసీ మాత్రం మానవత్వానికే మచ్చ తెచ్చింది. ఏకంగా ఏడుగురు శిశువులను హత్య చేసి, మరో ఆరుగురిని చంపడానికి ప్రయత్నించింది. ఇంజెక్షన్‌ ద్వారా శిశువుల రక్తంలోకి గాలిని పంపడం లాంటి చర్యలతో అత్యంత దారుణంగా శిశువులను చంపింది లూసీ. 2015లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అనేక విషయాలు బయటకు వస్తుండగా.. ఈ కేసులు దోషిగా తేలిన లూసీకి ఆగస్టు 21న కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.

New Update
నర్సు కాదు.. నరరూప రాక్షసి..ఏకంగా ఏడుగురి శిశువుల్ని క్రూరంగా చంపేసింది!

UK Killer Nurse: బ్రిటన్‌లో జరిగిన ఈ కథ వింటే ఒళ్లు గగుర్పొడవక మానదు.. అప్పుడప్పుడే పుట్టిన శిశువుల్ని ఓ నర్సు అత్యంత క్రూరంగా.. ఘోరంగా.. దారుణంగా.. ఇంజెక్షన్ల‌ ద్వారా అత్యంత అమానవీయంగా చంపేసిన ఘటన బ్రిటన్‌ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. మొత్తం ఏడుగురు శిశువుల్ని నర్సు చంపగా.. అందులో పుట్టి ఒక్క రోజు కూడా గడవని శిశువు ఉందంటే ఆ నర్సు కర్కశత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా.. ఈ కేసుకు సంబంధించి బయటకు వస్తున్న అనేక విషయాలు షాక్‌కి గురిచేస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్న లూసీ లెబ్టీ నేరానికి పాల్పడినట్టు ప్రూవ్‌ అయ్యింది. ఆగస్టు 21న ఆమెకు కోర్టు ఎలాంటి శిక్ష విధించనుందోనని ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. శిశువులకు సంబంధించిన హత్య కావడం.. అది కూడా అత్యంత పాశవికంగా ఓ నర్సు మర్డర్‌ చేయడంతో ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ న్యూస్‌ హైలెట్‌ అవుతోంది.

ఆ డాక్టర్‌ కోసమే ఇదంతా చేసిందా?
పిచ్చి వంద రకాలు.. లూసి పిచ్చి 101వ రకం. ఆమె పని చేస్తున్న ఆస్పత్రిలో ఓ డాక్టర్‌ అంటే లూసీకి ఇష్టం. ఆయనకు కూడా లూసీ అంటే ఇష్టం. శిశువుల ఆరోగ్యానికి సంబంధించి ట్రీట్‌మెంట్ చేసే డాక్టర్‌ అతను. అందుకే శిశువుల్ని హింసించడం.. డాక్టర్‌ని పిలవడం లూసీకి అలవాటుగా మారిందని దర్యాప్తులో తేలింది. అలా శిశువుల్ని హింసిస్తూ సైకో లాగా ఆనందం పొందేదట లూసీ. పర్సనల్‌ అటెన్షన్‌ కోసమే ఇలా చేసిందట. ఆ డాక్టర్‌తో లవ్‌ ఎమోజీలు.. హార్ట్‌ స్టిక్కర్లతో ఛాటింగ్‌ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆయన కోసమే ఇలా చేసిందని చెబుతున్నారు.

లూసీ నోట్స్‌లో ఏం ఉంది?

దర్యాప్తులో భాగంగా లూసీ రాసుకున్న నోట్స్‌ చాలా కీలకంగా వ్యవహరించాయి. ఈ నోట్స్‌లో ఉన్న ప్రధాన పాయింట్లు ఏంటంటే?

➼ 'నాకు పిల్లలు పుట్టను లేదా వివాహం చేసుకోను'
➼ 'పిల్లలను చూసుకునేంత మంచివాడిని కాను.. నేను ఉద్దేశపూర్వకంగా వారిని చంపాను'
➼ 'కుటుంబాన్ని కలిగి ఉండటం ఎలా ఉంటుందో నాకు ఎప్పటికీ తెలియదు'

పిల్లలపై దాడి చేయడానికి లూసీ వివిధ పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు ప్రాసిక్యూటర్లు సాక్ష్యాలను సమర్పించారు. అవేంటంటే?

• శిశువుల రక్తంలోకి గాలి పంపిండం
• ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయడం
• జీర్ణశయాంతర ప్రేగులలోకి గాలి ఇన్ఫ్యూస్‌ చేయడం
• అధిక మోతాదులో పాలు తాగిండం
• ఇతర ద్రవాలను బలవంతంగా తినిపించడం

భారతీయుడే అలెర్ట్ చేశాడు:
చెస్టర్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ రవి జయరామ్, తన సహోద్యోగి అయిన లూసీ లెట్బీ గురించి పోలీసులను అప్రమత్తం చేశాడు. జూన్ 2015లో ముగ్గురు శిశువులు మరణించిన తర్వాత కన్సల్టెంట్‌లు మొదట ఆందోళనలు వ్యక్తం చేశాయి. మరికొంత మంది శిశువులు కుప్పకూలి చనిపోయారు. ఆ సమయంలో సీనియర్ మెడిక్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్‌లతో జయరామ్‌ సమావేశాలు నిర్వహించారు. చివరికి, 2017 ఏప్రిల్‌లో నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ట్రస్ట్ ఒక పోలీసు అధికారిని కలవడానికి వైద్యులను అనుమతించింది. కొంతకాలం తర్వాత, లూసీ అరెస్టుకు దారితీసే దర్యాప్తు ప్రారంభమైంది. ఈ క్రమంలోనే లూసీని అరెస్టు చేసి రెండుసార్లు విడుదల చేశారు. 2020లో ఆమె మూడోసారి జైలుకు వెళ్లింది. అప్పటినుంచి నిర్భందంలోనే ఉండగా.. లూసీనే నేరానికి పాల్పడినట్టు తేలింది. ఆగస్టు 21న ఆమెకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.

Advertisment
తాజా కథనాలు