Corona December Link: డిసెంబర్‌లోనే కొత్త వేరియంట్లు ఎందుకు వ్యాప్తి చెందుతాయి? కరోనాతో ఈ నెలకు ఉన్న బంధమేంటి? 2020 డిసెంబర్‌లో డెల్టా వేరియంట్ తన ఉనికిని చాటుకుంటే.. 2021 డిసెంబర్‌లో ఒమిక్రాన్ కోరలు చాచింది. ఈ డిసెంబర్‌లో JN.1 వేరియంట్ భయపెడుతోంది. నేచర్ జర్నల్ అధ్యయనాల ప్రకారం చల్లని వాతావరణ పరిస్థితులు వైరస్ వ్యాప్తిని పెంచుతాయి. అందుకే డిసెంబర్‌లో ముందుగా కేసుల హైక్ కనిపిస్తుంది. By Trinath 25 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి కరోనా(Corona) రూటే సపరేటుగా ఉంటుంది. ఎప్పుడు సైలెంట్‌గా ఉంటుందో.. ఎప్పుడు కాటు వేస్తుందో అంతుబట్టదు. అప్పటివరకు గుట్టుచప్పుడు కాకుండా ఓ మూలన నక్కే వైరస్ ఉన్నట్టుండి రాకెట్ వేగంతో దూసుకొస్తుంది. మళ్లీ వెంటనే పెట్రోల్ ఆగిపోయిన స్పోర్ట్స్ బైక్‌లా ఆగిపోతుంది. సర్లే ఇంకా ఈ కరోనా రాదులే అని మన పని మనం చేసుకుంటుంటే మళ్లీ ఎక్కడి నుంచో వచ్చి మన ముందే వాలుతుంది. ఈ వైరల్ వేషాలు అన్నీఇన్నీ కావు. కరోనా సెకండ్ వేవ్‌లో ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసిన ఈ మహమ్మారి ఆ తర్వాత కూడా తన ఉనికిని అప్పుడప్పుడు చాటుకుంటునే ఉంటోంది. మధ్యలో ఒమిక్రాన్ రూపంలో థర్డ్‌వేవ్‌తో కేసుల ప్రవాహాన్ని తలపించింది. మళ్లీ వెంటనే శాంతించింది. ఇక కరోనా ఖేల్ ఖతం అని అంతా భావించిన సమయంలో తాజాగా మరోసారి కొత్త కోరలతో భయపెడుతోంది. ప్రస్తుతం JN.1 వేరియంట్ వేగంగా ప్రయాణిస్తోంది. అయితే మీరు గమనిస్తే ఈ కొత్త వేరియంట్లు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేది ఎక్కువగా డిసెంబర్‌లోనే! డెల్టా.. ఒమిక్రాన్.. జేఎన్.1: ప్రపంచాన్ని గడగడలాడించిన వేరియంట్లలో డెల్టా అన్నిటికంటే ముందు ఉంటుంది. దీని కారణంగా వేల మంది చనిపోయారు. ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. డెల్టా వేరియంట్ వ్యాప్తిగా బీజం పడింది కూడా 2020 డిసెంబర్‌లోనే. అప్పటినుంచి మొదలైన వ్యాప్తి ఇండియాలో 2021 జూన్ వరకు కొనసాగింది. ఏప్రిల్ చివరి వారంతో పాటు మే మొదటి వారంలో కరోనా పీక్స్‌కు వెళ్లింది. ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో వేలాది మంది మరణించారు. ఆస్పత్రుల్లో బెడ్స్ లేక రోగులు నానా అవస్థలు పడ్డారు. అంతటి భయంకర పరిణామాల నుంచి తేరుకునే లోపే 2021 డిసెంబర్‌లో ఒమిక్రాన్ స్పీడ్ పెంచింది. 2021 డిసెంబర్‌లో మొదలైన ఒమిక్రాన్ ప్రవాహం 2022 జనవరిలో పీక్స్‌కు వెళ్లింది. ఇక మళ్లీ తాజాగా JN.1 వేరియంట్ ప్రజలను భయపెడుతోంది. వాతావరణ పరిస్థితులే కారణమా? అనేక అధ్యయనాలు కోవిడ్-19 కేసుల పెరుగుదల వెనుక ఒక వేగవంతమైన కారకంగా చల్లని, పొడి శీతాకాలాన్ని సూచించాయి. నేచర్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు వైరస్ ఎంత సులభంగా వ్యాప్తి చెందుతాయో చూపిస్తున్నాయి. వేసవి నుంచి శీతాకాలానికి మారినప్పుడు, ఉష్ణోగ్రత పడిపోతుంది. గాలి పొడిగా మారుతుంది. చైనాలోని సిచువాన్ ఇంటర్నేషనల్ స్టడీస్ యూనివర్శిటీ పరిశోధకులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. శీతల పరిస్థితులలో నివసించే వారు కరోనావైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక డిసెంబర్ అంటే చాలా దేశాల్లో హాలీడేస్ ఉంటాయి. ఇది కూడా ఈ నెలలో వైరస్ వ్యాప్తి పెరడానికి కారణంగా చెప్పవచ్చు. Also Read: ‘నల్లగా ఉంటారు.. బాత్‌రూమ్‌లు కడుగుతారు..’ ముదురుతున్న యుద్ధం! WATCH: #corona మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి