Congress Account Freeze: కాంగ్రెస్ ఎకౌంట్స్ ఫ్రీజ్.. రిలీజ్.. 115 కోట్ల ట్విస్ట్ ఏమిటి? తెలుసుకోండి!

ఆదాయపు పన్ను శాఖ కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఎకౌంట్స్ ను స్తంభింపచేసింది. దీంతో కాంగ్రెస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ లో అప్పీల్ చేసింది.  ట్రిబ్యునల్ కేసు విచారణ పూర్తి అయ్యే వరకు రూ.115 కోట్లను ఎకౌంట్స్ లో ఫ్రీజ్ చేయాలని చెప్పింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

Congress Account Freeze: కాంగ్రెస్ ఎకౌంట్స్ ఫ్రీజ్.. రిలీజ్.. 115 కోట్ల ట్విస్ట్ ఏమిటి? తెలుసుకోండి!
New Update

Congress Account Freeze: దేశరాజకీయాల్లో నిన్న అంటే ఫిబ్రవరి 16న ఒక పెద్ద కుదుపు వచ్చింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఎకౌంట్స్ ను ఆదాయపు పన్ను శాఖ స్తంభింపచేసింది. దీంతో పెద్ద దుమారం రేగింది. అయితే, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఆదాయపు పన్ను వివాదాలను విచారించే అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) తలుపు తట్టింది. విషయాన్ని పరిశిలించిన ట్రిబ్యునల్ కాంగ్రెస్ ఎకౌంట్స్ రిలీజ్ చేయాలని ఆదేశించింది. అయితే, కాంగ్రెస్ పార్టీ తన ఎకౌంట్స్ లో 115 కోట్ల రూపాయల మినిమమ్ మెయింటెయిన్ చేయాలనే షరతు విధించింది ట్రిబ్యునల్. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అసలు 115 కోట్ల రూపాయలు ఫ్రీజ్(Congress Account Freeze) చేయడం దేనికి? అంతేకాకుండా, దేశంలోని రాజకీయ పార్టీలకు ఆదాయపు పన్ను నుంచి 100 శాతం మినహాయింపు ఉందని చెబుతారు. మరి ఎందుకు 210 కోట్లరూపాయల టాక్స్ కాంగ్రెస్ బకాయి ఉందని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది? ఈ ప్రశ్నలకు నిపుణులు చెప్పిన సమాధానాలు ఏమిటో తెలుసుకుందాం. 

అసలు ఆదాయపు పన్ను శాఖ చర్య ఎందుకు?

కాంగ్రెస్ పార్టీ ఎకౌంట్స్ (Congress Account Freeze)స్తంభింపచేయడానికి కారణంగా 2018-19 ఆర్థిక సంవత్సరం టాక్స్ రిటర్న్స్ విషయంలో జరిగిన ఇబ్బందిగా ఆదాయపు పన్ను శాఖ చెప్పింది. దీనిప్రకారం 210 కోట్ల రూపాయల టాక్స్ కాంగ్రెస్ పార్టీ బకాయి పడింది. అయితే, రాజకీయ పార్టీలకు నూరు శాతం టాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ 210 కోట్ల టాక్స్ బకాయి ఎలా వస్తుంది? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. కానీ, టాక్స్ మినహాయింపు అనేది చాలా శరతలులకు లోబడి ఉంటుంది. ఈ షరతులు దాతల గురించిన సమాచారం, పార్టీ ఖాతాల ఆడిట్ నివేదికలు, ఎన్నికల కమిషన్‌కు నివేదికలు అలాగే అటువంటి అవసరమైన సంబంధిత సమాచారాన్ని అందించడం వంటివి కలిగి ఉంటాయి. ఈ షరతుల విషయంలో రిటర్న్స్ ఫైల్ చేసినపుడు ఎక్కడో తప్పు జరిగి ఉండవచ్చు అని తెలుస్తోంది. ఆదాయపు పన్ను శాఖ రిటర్న్స్ విషయంలో ఏదైనా అవకతవకలు కనిపిస్తే చర్య తీసుకునే అధికారం ఉంటుంది. అంటే, ఎవరైనా వ్యక్తి, ఏదైనా సంస్థ టాక్స్ రిటర్న్స్ విషయంలో చిక్కులు ఉన్నపుడు అవి క్లియర్ చేసేవరకు వారి బ్యాంక్ ఎకౌంట్స్ సంభింపచేయడానికి ఆదాయపు పన్ను శాఖకు అధికారం ఉంటుంది. ఇలా ఎవరిదైనా ఎకౌంట్స్ స్తంభింప చేసినపుడు సదరు పార్టీ తనకు అన్యాయం జరిగింది అని భావిస్తే ఐటీఏటీ అంటే ట్రిబ్యునల్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. అంటే.. కోర్టులో కేసు వేసినట్టే అన్నమాట. అలా కాంగ్రెస్ పార్టీ తమ ఎకౌంట్స్ (Congress Account Freeze)ను స్తంభింప చేసిన వెంటనే అప్పిలేట్ ను ఆశ్రయించింది. 

Also Read: పేటీఎం ఫాస్టాగ్ డీయాక్టివేట్ చేసుకోవడం ఎలా?

మరి 115 కోట్లు ఎందుకు ఫ్రీజ్ చేసినట్టు?

అప్పిలేట్ కాంగ్రెస్ ఎకౌంట్స్ రిలీజ్ చేయమని చెప్పింది. కానీ, 115 కోట్లరూపాయలు ఎకౌంట్స్ లో ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. ఇలా ఎందుకు జరిగింది అర్థం అవ్వాలంటే ఈ ఉదాహరణ అర్ధం చేసుకోవాలి. మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నారు. ప్రతి నెల నేరుగా బ్యాంక్ ఎకౌంటు నుంచి ఈఎంఐ ఆటో డెబిట్ అయిపోతోంది. ఎప్పుడైనా.. మీ ఎకౌంట్ లో డబ్బు లేకపోతే మీ ఈఎంఐ మొత్తం నెగెటివ్ బ్యాలెన్స్ గా కనిపిస్తుంది. తరువాత ఎకౌంట్ లోకి డబ్బు పడిన వెంటానే ఆ ఈఎంఐ డబ్బు కట్ అయి తరువాత మీ ఎకౌంట్ లో మిగిలిన బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఇలా మీ ఈఎంఐ ఫ్రీజ్ చేయడాన్ని లీయన్( lien) మార్క్ ఎకౌంట్ గా చెబుతారు. ఇప్పుడు ట్రిబ్యునల్ కూడా కాంగ్రెస్ విషయంలో ఇలా లీయన్ విధానాన్ని అప్లై చేసింది. ఎందుకంటే, ఆదాయపు పన్ను శాఖ టాక్స్ బకాయిలు ఉన్నాయని చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు.. ఇదంతా ఎన్నికల ముందు మాపై చేస్తున్న దాడి అని అంటోంది. ఈ నేపథ్యంలో అప్పిలేట్ ఈ విషయాన్ని విచారించడానికి కొద్దిగా సమయం పడుతుంది. అంతవరకూ మొత్తం ఎకౌంట్స్ ఫ్రీజ్ లో ఉంటె కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. అలా అని ఎకౌంట్స్ ఫ్రీజ్ తీసేస్తే.. ఒకవేళ విచారణలో పార్టీ ఆదాయపు పన్ను శాఖకు బకాయి ఉన్నట్టు తేలితే రికవరీ చేయడం కష్టం అవుతుంది. ఇందుకోసమే కేసు తేలేంత వరకూ 115 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేయాలని ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. 

అదండీ విషయం ఆదాయపు పన్ను శాఖ చెబుతున్న విషయంపై ఇప్పుడు ట్రిబ్యనల్ అథారిటీ విచారణ చేస్తుంది. అంతవరకూ కాంగ్రెస్ 115 కోట్ల రూపాయలు తప్ప మిగిలిన డబ్బును తన ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చు. 

Watch this Interesting Video:

#congress #incom-tax
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe