చిల్గోజా...ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. దీన్ని తినడం వల్ల మీ ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. దీనిని ఇంగ్లీష్ లో పైన్ నట్స్ అని అంటారు. ఇవి కిలో 5 నుంచి 6 వేల రూపాయల వరకు ఉంటుంది. నిజానికి ఈ డ్రై ఫ్రూట్ అడవుల్లోని చెట్ల నుంచి లభిస్తుంది. ఇది భారతదేశంలోని కొన్ని కొండ ప్రాంతాలలో ఉన్నప్పటికీ... ప్రధానంగా చైనా, పాకిస్థాన్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. వీటిని తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అంతేకాదు వీటిని తింటే జలుబు, ఫ్లూ వంటి అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. చిల్గోజాకు వేడి ప్రభావం ఉంటుంది. అంతే కాకుండా ఈ డ్రై ఫ్రూట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
1. ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది:
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటైన చిల్గోజా మీ శరీరంలో ఐరన్ లోపాన్ని తొలగిస్తుంది. రక్తాన్ని పెంచడంతోపాటు రక్తహీనత వంటి వ్యాధులను నివారిస్తుంది. ప్రతిరోజూ కేవలం 5 చిల్‌గోజా గింజలు తినడం వల్ల ఈ వ్యాధికి చెక్ పెట్టవచ్చు. హిమోగ్లోబిన్‌ను సమతుల్యంగా ఉంచడంలోనూ ఎంతగానో సహాయపడుతుంది.
2. గుండెకు మేలు చేస్తుంది:
ఈ డ్రై ఫ్రూట్ గుండెకు చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మీ గుండె ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ విధంగా హృద్రోగులకు కూడా మేలు చేస్తుంది.
3. మెదడు ఆరోగ్యానికి మంచిది:
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ డ్రై ఫ్రూట్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒమేగా-3 పుష్కలంగా ఉంటడంతో మీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు మీ మెదడుకు ఆలోచించే...అర్థం చేసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సెల్యులార్ ఒత్తిడి, వాపును తగ్గిస్తాయి. కాబట్టి మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.