చిల్గోజా…ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్స్లో ఒకటి. దీన్ని తినడం వల్ల మీ ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. దీనిని ఇంగ్లీష్ లో పైన్ నట్స్ అని అంటారు. ఇవి కిలో 5 నుంచి 6 వేల రూపాయల వరకు ఉంటుంది. నిజానికి ఈ డ్రై ఫ్రూట్ అడవుల్లోని చెట్ల నుంచి లభిస్తుంది. ఇది భారతదేశంలోని కొన్ని కొండ ప్రాంతాలలో ఉన్నప్పటికీ… ప్రధానంగా చైనా, పాకిస్థాన్లో ఎక్కువగా కనిపిస్తుంది. వీటిని తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అంతేకాదు వీటిని తింటే జలుబు, ఫ్లూ వంటి అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. చిల్గోజాకు వేడి ప్రభావం ఉంటుంది. అంతే కాకుండా ఈ డ్రై ఫ్రూట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..ప్రపంచంలో ఖరీదైన డ్రైఫ్రూట్…కేజీ ఎంతో తెలుస్తే నోరెళ్లబెడతారు..!!
డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. అయితే డ్రైఫ్రూట్స్ అనగానే బాదం, పిస్తా, కాజు, ఇలా ఎన్నో వెరైటీలు గుర్తుకువస్తాయి. వీటి ధరకూడా ఎక్కువే. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రైఫ్రూట్ ఏదో తెలుసా? దీని ధర తెలుస్తే కూడా షాక్ అవుతారు.
Translate this News: