బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఆ సమావేశానికి కేసీఆర్ ను ఆహ్వానించలేదు. సమావేశం తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమిలో ఉన్న ఎన్సీపీలో విభేదాలు వచ్చాయి. అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ విడిపోయింది. ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం గమనార్హం. ఆ మరుసటి రోజే అఖిలేశ్ హైదరాబాద్ పర్యటనకు రావడం కొత్త చర్చకు దారి తీసింది. వీరిద్దరు ఏం మాట్లాడారన్నది హాట్ టాపిక్ గా మారింది.
విపక్షాల కూటమి నెక్స్ట్ మీటింగ్ త్వరలో బెంగళూరులో జరగనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కూటమిలోకి ఆహ్వానించేందుకే అఖిలేశ్ హైదరాబాద్ వచ్చారాని ఓ వైపు ప్రచారం సాగుతుండగా.. కూటమిని ఆర్గనైజ్ చేస్తున్న నితీశ్ కుమార్ కూడా వెంట వచ్చేవారని, ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించే వారనే చర్చ కూడా ఉంది.ఏదేమైనా వీరిద్దరి కలయిక రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
బీజేపీకో హఠానేకు రాస్తా బనారే: అఖిలేశ్
‘సబ్ కా లక్ష్య్ ఏక్ ఈ హై.. బీజేపీకో హఠానే చహతాహై.. ఇసీ కే లియే రాస్తా బనారే..’ అని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీని గద్దె దించడమే విపక్షాల లక్ష్యం అని అఖిలేష్ ఉద్ఘాటించారు. బీజేపీ వ్యతిరేకులను కలుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విపక్షాల పోరాటంపై కేసీఆర్‌తో చర్చించేందుకు వచ్చానని తెలిపారు. అందరి లక్ష్యం కూడా బీజేపీని అధికారం నుంచి దించడమే అని స్పష్టం చేశారు. కేసీఆర్‌తో భేటీ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతాను అని అఖిలేష్ వెల్లడించారు.