Asia Cup Final: ఆసియా కింగ్ ఎవరు.. భారత్-లంక మధ్య గణాంకాలు ఏం చెబుతున్నాయి?

కాసేపట్లో ఆసియా కింగ్ ఎవరో తేలిపోనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నువ్వా నేనా అనే రీతిలో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే బౌటింగ్, బౌలింగ్‌లో బలంగా ఉన్న రోహిత్ సేననే ఫేవరెట్‌గా కనపడుతుంది.

New Update
Asia Cup Final: ఆసియా కింగ్ ఎవరు.. భారత్-లంక మధ్య గణాంకాలు ఏం చెబుతున్నాయి?

Asia Cup Final: కాసేపట్లో ఆసియా కింగ్ ఎవరో తేలిపోనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నువ్వా నేనా అనే రీతిలో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే బౌటింగ్, బౌలింగ్‌లో బలంగా ఉన్న రోహిత్ సేననే ఫేవరెట్‌గా కనపడుతుంది. కానీ లంకేయులను అంత తక్కువ అంచనా వేయకూడదు. వారిది అయిన రోజు ఎలాంటి జట్టునైనా ఓడించగలరు. చివరిసారిగా 2018 ఆసియాకప్ టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. దీంతో ఐదేళ్ల తర్వాత జరగనున్న ఆసియాకప్ ఫైనల్‌ను గెలవాలని కసిగా ఉంది. అయితే స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య ఆడనుండటం లంకకు ప్లస్ కానుంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డేగా రేపు మ్యాచ్ జరగనుంది.

ఇప్పటివరకు భారత్-లంక మధ్య జరిగిన గణాంకాలను పరిశీలిస్తే.. ఇరు జట్ల మధ్య 166 వన్డే మ్యాచులు జరగగా అందులో భారత్ 97 మ్యాచులు గెలవగా.. శ్రీలంక 57 మ్యాచులు గెలిచింది. 11 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. ఒక్క మ్యాచ్ టై అయింది. ఇక ఆసియా కప్‌లో అయితే రెండు టీంలు 22 సార్లు తలపడ్డాయి. ఇందులో చెరో 11 మ్యాచ్‌లు గెలుచుకుని సమఉజ్జీలుగా నిలిచాయి. అయితే గత ఐదు మ్యాచులలో మూడు మ్యాచులు లంక గెలవడం విశేషం. మరోవైపు ఇప్పటివరకు ఆసియా కప్ ఫైనల్‌లో ఇరు జట్లూ 7 సార్లు తలపడ్డాయి. ఇందులో నాలుగు సార్లు భారత్, మూడు సార్లు లంకేయులు గెలిచి టోర్నీ దక్కించుకున్నారు. మొత్తంగా చూసుకుంటే భారత్ అత్యధికంగా ఏడు సార్లు ట్రోఫీని ముద్దాడగా.. శ్రీంలక ఆరు సార్లతో రెండో స్థానంలో ఉంది.

ఇక ఫైనల్ మ్యాచ్ జరిగే ప్రేమదాస స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువగా విజయం సాధించాయి. ఈ స్టేడియంలో మొత్తం 146 మ్యాచ్‌లు జరగగా.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 80 మ్యాచ్‌లను గెలుచుకోగా ఛేజింగ్ టీమ్ 56 మ్యాచ్‌లలో గెలిచింది. ఈ స్టేడియంలో శ్రీలంక మొత్తంగా 123 వన్డేలు ఆడి 76 గెలిచి, 40 మ్యాచ్‌లలో ఓడింది. భారత్ - శ్రీలంక జట్లు ప్రేమదాసలో 37 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో 18 మ్యాచ్‌లు భారత్ గెలవగా 16 మ్యాచ్‌లను లంక గెలిచింది. ఈ స్టేడియంలో కింగ్ కోహ్లీ గత ఐదు ఇన్నింగ్స్‌లలో ఏకంగా నాలుగు సెంచరీలు చేయడం విశేషం.

తుది జట్లు అంచనా..

భారత్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), గిల్‌, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌, ఇషాన్‌ కిషాన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్‌/సుందర్‌, కుల్దీప్‌ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌, బుమ్రా

శ్రీలంక: షనక (కెప్టెన్‌), కుషాల్‌ పెరెరా, నిషాంక, కుషాల్‌ మెండిస్‌, సమరవిక్రమ, చరిత అసలంక, ధనంజయ, దునిత్‌, దుషన్‌, పతిరణ, కసున్‌ రజిత

ఇది కూడా చదవండి: వరల్డ్‌కప్‌ టోర్నీ ముందు టీమిండియాకు వరుస దెబ్బలు

Advertisment
Advertisment
తాజా కథనాలు