Justice Hima Bindu: చంద్రబాబుకు రిమాండ్ తీర్పు ఇచ్చిన జస్టిస్ హిమ బిందు గురించి ఈ విషయాలు తెలుసా? స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పునిచ్చిన జస్టిస్ బొక్క సత్య వెంకట హిమ బిందు పేరు మారుమోగుతోంది. 2016లో అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జ్, అమలాపురం, తూర్పు గోదావరి జిల్లాలో విధులు నిర్వహించారు. ఉమ్మడి ఏపీలోని పలు కోర్టుల్లో న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. By Trinath 11 Sep 2023 in తూర్పు గోదావరి విజయవాడ New Update షేర్ చేయండి Who is justice Hima bindu: 45ఏళ్ల ప్రత్యేక్ష రాజకీయాల్లో దేశవ్యాప్తంగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu naidu). ఆయనపై ఎన్ని ఆరోపణలున్నా ఇప్పటివరకు ఏ కేసులోనూ జైలు గడప తొక్కింది లేదు. స్కిల్ స్కామ్ డెవలప్‌మెంట్ కేసు(Skill development scam case)లో ఆయన అరెస్ట్ అవ్వడం.. ఏసీబీ కోర్టులో హాజరుపరచడాన్ని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఇదంతా 24గంటల్లో జరిగిపోయింది. నిరసనలు, హౌస్ అరెస్ట్‌లతో రాష్ట్రం అట్టుడుకిపోతోంది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఎలాంటి తీర్పునిస్తుందోనని అంతా ఎదురుచూశారు. అందరి చూపు ఆ జడ్జిపైనే ఉంది. నిజానికి చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడికి సంబంధించి తీర్పు ఇస్తున్నాం అంటే ఒత్తిడి ఉంటుందని అనుకుంటారు. అయితే ఆ జడ్జిని చూస్తే ఎలాంటి టెన్షన్ పడుతున్నట్టు అనిపించలేదు. ఇరు వాదనలు విన్నారు.. ఏం చేయాలో అదే చేశారు.. మరో మాట లేకుండా చంద్రబాబుకు రిమాండ్(ramand) విధించారు. ఈ తీర్పు గురించి వివిధ వర్గాల్లో భిన్నభిప్రాయాలు ఉండొచ్చు కానీ.. అందరి నోటా మాత్రం జస్టిస్ హిమబిందు(justice hima bindu) పేరు మారుమోగుతోంది. అటు సామాన్యుల్లోనూ ఈ తీర్పు నమ్మకాన్ని మరింత పెంచింది. జస్టిస్ హిమ బిందు ఎవరు? జస్టిస్ బొక్క సత్య వెంకట హిమ బిందు.. చంద్రబాబు కేసులో తీర్పు ఇచ్చిన ఏసీబీ న్యాయమూర్తి పూర్తి పేరు ఇది. ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు కూడా జస్టిస్ హిమబిందుదే. 2016లో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేశారు జస్టిస్ హిమబిందు. అంతకు ముందు ఆమె ఏసీబీ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 18, అంటే 2023న, సీబీఐ నిర్వహించే అంశాలకు సంబంధించి ఆమెకు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి పదవిని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై జస్టిస్ హిమ బిందు ఇచ్చిన రిమాండ్ తీర్పు అందరి దృష్టినీ ఆకర్షించింది. గతంలో కూడా ఆమె అనేక సంచలన తీర్పులు ఇచ్చారు. Also Read: చంద్రబాబుకు మరో షాక్.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పిటిషన్ జస్టిస్ హిమబిందు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర నిందితులతో ప్రాథమికంగా కుమ్మక్కయ్యారని ప్రాసిక్యూషన్‌తో జస్టిస్ హిమబిందు అంగీకరించారు. చంద్రబాబుపై అభియోగాలు మోపిన నేరాలు ఐపీసీ(IPC) కింద గణనీయమైనవన్నారు. రిమాండ్ రిపోర్టులోని అంశాలు, సాక్షుల వాంగ్మూలం, సేకరించిన అంశాలు.. చంద్రబాబు ప్రభుత్వోద్యోగిగా విధులు నిర్వహిస్తూనే నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ప్రాథమికంగా తేలిందని కోర్టు పేర్కొంది. అవినీతి, చట్టవిరుద్ధమైన పద్ధతుల ద్వారా ప్రభుత్వ నిధులను రూ.279 కోట్ల మేర దుర్వినియోగం చేసి, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించారన్నారు. ఇతర నిందితులు, షెల్ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు సంబంధాన్ని ఏర్పరచడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు తేల్చింది. అదేవిధంగా.. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆమోదంలో చంద్రబాబు పాత్రకు కావాల్సింత మెటీరియల్ ఉందని కోర్టు తెలిపింది. ALSO READ: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఒంటరిగానే చంద్రబాబు.. కలవని కుటుంబసభ్యులు! #chandrababu #chandrababu-arrest #justice-hima-bindu #hima-bindu-judge #justice-hima-bindu-biodata #justice-hima-bindu-profile మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి