Cyclone Names: తుపాన్‌లకు పేర్లు ఎవరు పెడతారు..ఎలా పెడతారు.?

2000 సంవత్సరంలో యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్ కమిషన్‌ ఫర్‌ ఏసియా అండ్‌ పసిఫిక్‌ తుపాన్లకు పేర్లు పెట్టే సాంప్రదాయాన్ని ప్రవేశ పెట్టాయి. పేర్లు పెట్టే దేశాల్లో భారత్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, ఒమన్‌, మయన్మార్‌, పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక దేశాలు ఉన్నాయి.

Cyclone Names: తుపాన్‌లకు పేర్లు ఎవరు పెడతారు..ఎలా పెడతారు.?
New Update

Cyclone Names: ఇటీవల మిచౌంగ్ తుపాన్ చెన్నైతో పాటు ఏపీ, తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లతో ఈ తుపాను వలన కుండపోత వర్షం కురిశాయి. ఇక మిచౌంగ్‌ వల్ల ప్రాణ నష్టం, ఆస్తినష్టం కూడా సంభవిస్తుంది. ఇక తుపాన్‌ వచ్చినప్పుడల్లా వాటి పేర్లను చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అయితే .. తుపాన్‌కి ఆ పేర్లు ఎవరు పెడతారు..? ఎలా పేడుతారు..? ఈ తుపాన్లకు పేర్లు పెట్టడంలో కొన్ని దేశాలు నియమ నిబంధనలు పాటించడం తప్పనిసరి చేశాయి. మరి ఆ పేర్లను ఎలా నామరణం చేస్తారో ఇప్పుడు కొన్ని ఈ విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా  ఆరు వాతావరణ కేంద్రాలు..



తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయన్ని 2000 సంవత్సరంలో యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్ కమిషన్‌ ఫర్‌ ఏసియా అండ్‌ పసిఫిక్‌, ఇంకా వరల్డ్‌ మెట్రలాజికల్‌ ఆర్గనైజేషన్‌ ప్రారంభించింది. ఈ తుపాన్ల పలు రకాల పేర్లు విన్నప్పుడల్లా ఈ పేర్లు ఎవరు పెడతారు..? ఎందుకు పెడతారు..? ఎలా పెడతారు..? అనేది డౌట్ చాలా మందిలో ఉంటుంది.అయితే.. తుపాన్లకు పేర్లు పెట్టడం వెనుక పెద్ద కారణమే ఉందని మీకు తెలునా..? ఈ తుపాన్‌ సమాచారం కోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు వాతావరణ కేంద్రాలు, ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుపాను హెచ్చరికల కేంద్రాలు పనిచేస్తున్నాయి.ఈ కేంద్రాలే తుపాన్ల హెచ్చరికలు, సూచనలతో పాటు నామకరణాలు కూడా ఈ కేంద్రాలే పెడుతుంటాయి.

ఇది కూడా చదవండి: అమ్మాయి మనసును గెలుచుకోవాలనుకుంటే ఇలా చేయండి!

ఒక్కోదేశం 13 పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేశారు. ఇందులో భారత్‌, పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, ఒమన్‌, శ్రీలంక దేశాలున్నాయి. ఇక అప్పటి నుంచి తుపాన్లకు పేర్లు పెట్టడం ఆనవాయితీగా కొనసాగుతుంది. బంగాళాఖాతంలో, అరేబియా సముద్రాలలో ఏర్పడే ఈ తుపాన్లకు ఈ పేర్లను ఎక్కువగా పెడుతుంటారు. అంతేకాదు ఢిల్లీలోని వాతావరణ కేంద్రం కొన్ని తుపాన్ల పేర్లను ముందుగానే నిర్ణయిస్తుంది. రానున్న తుపానుకు ఒక పేరును సూచించాలని సభ్యదేశాలన నిపుణులు కోరుకుంటున్నారు. దీనిని అరేబియా సముద్రం, బంగాళాఖాతం తీరంలో ఉన్న సభ్య దేశాలకు పంపుతారు. తుపాన్లకు పేరు పెట్టే సంస్కృతికి అమెరికానే తెరపైకి తీసుకువచ్చింది. అయితే.. 2018లో ఈ ప్యానెల్లో ఖతార్, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ మొత్తం 64 పేర్లను ఈ 8 దేశాలు ఎంపిక చేశారు. ఇప్పటి వరకు 57 పేర్లను ఆయా తుపాన్లకు నామకరణం చేశారు. అయితే..అగ్ని, జలి, బిజిలి, ఆకాష్ అనే పేర్లను భారత్, మలా అనే పేరు శ్రీలంక, హెలెన్ అనే పేరు బంగ్లాదేశ్, నీలోఫర్‌ పాకిస్తాన్ ఇప్పటివరకు పేర్లు పెట్టారు. దేశ వ్యాప్తంగా ఇటీవల తుపాన్లు అనే రాష్ట్రాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#cyclone-names
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe