Butter Chicken : బట్టర్‌ చికెన్ కనిపెట్టింది మేమే అంటూ కోర్టుకెక్కిన హోటల్‌ పంచాయితీ!

నాన్ వెజ్‌ ప్రియులకు ఎంతో ఇష్టమైన చికెన్ ఐటమ్‌ బటర్ చికెన్‌ ఒకటి... ఆ తరువాత చాలా మంది ఎక్కువగా తినే ఐటమ్ దాల్‌ మఖానీ అయితే ఇప్పుడు ఈ రెండు ఐటమ్స్‌ గురించి రెండు రెస్టారెంట్ల యజామాన్యాలు కోర్టుకెక్కాయి.

Butter Chicken : బట్టర్‌ చికెన్ కనిపెట్టింది మేమే అంటూ కోర్టుకెక్కిన హోటల్‌ పంచాయితీ!
New Update

Delhi High Court : నాన్ వెజ్‌(Non-Veg) ప్రియులకు ఎంతో ఇష్టమైన చికెన్ ఐటమ్‌ బటర్ చికెన్‌(Butter Chicken) ఒకటి... ఆ తరువాత చాలా మంది ఎక్కువగా తినే ఐటమ్ దాల్‌ మఖానీ(Dhal Makhani). అయితే ఇప్పుడు ఈ రెండు ఐటమ్స్‌ గురించి రెండు రెస్టారెంట్ల యజామాన్యాలు కోర్టుకెక్కాయి. ఢిల్లీలోని రెండు ప్రముఖ రెస్టారెంట్ల మధ్య వార్ నడుస్తోంది.మోతీ మహల్ వ్యవస్థాపకుడు దివంగత చెఫ్ కుందన్ లాల్ గుజ్రాల్ బటర్ చికెన్, దాల్ మఖానీని ముందుగా తయారు చేశారని పేర్కొంటూ మోతీ మహల్ యజమాని దావా వేశారు.

మోతీలాల్ మహల్‌ ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బటర్ చికెన్, దాల్ మఖానీని ముందుగా మేమే తయారు చేశారని పేర్కొంటూ ఉన్న వ్యాఖ్యలు వివిధ సోషల్‌ మీడియా(Social Media) ల్లో ప్రత్యక్షమయ్యాయి. దీని వల్ల దర్యాగంజ్ రెస్టారెంట్ యాజమాన్యం రెస్టారెంట్‌ కు గౌరవభంగం వాటిల్లిందని వారు ఆరోపించారు. అయితే ఈ విషయం గురించి మోతీ మహల్‌ యజమానులు ఆ ఇంటర్వ్యూలో వచ్చిన అంశం సంపాదకీయ దృక్పథం అని దానిని తమకు ఆపాదించాలని వారు అంటున్నారు. అయితే వీటికి సంబంధించి పిటిషన్‌  దాఖలు చేయాలంటూ మోతీ మహల్‌ రెస్టారెంట్‌ యజమానులను జస్టిస్‌ నరులా ఆదేశించారు. ఈ అఫిడవిట్‌ను రెండు వారాల్లోగా దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఈ విషయం గురించి తమ పూర్వికుడు దివంగత కుందన్‌ లాల్‌ గుజ్రాల్‌... దాల్‌ మఖానీ, బటర్‌ చికెన్‌ వంటకాలను కనుగొన్నారని... దీని గురించి దర్యాగంజ్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని కోర్టను ఆశ్రయించారు మోతీ మహల్‌ యజమానులు. దీంతో ఈ అంశం పెద్ద వివాదంగా మారింది. దీంతో ఢిల్లీ కోర్టు బట్టర్ చికెన్ మేమే కనిపెట్టాం అనే ట్యాగ్‌ లైన్‌ ఉపయోగించకూడదని సమన్లు జారీ చేసింది.

Also Read : మెగా వారసురాలిని చూశారా.. అచ్చు తండ్రిలానే…

#delhi-court #chicken-butter #dhal-makhani #butter-chicken
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe