శీతాకాలంలో నల్ల నువ్వులను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా! శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లును దూరం చేయడానికి నల్ల నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకలను బలంగా చేయడంతో పాటు రక్తపోటును, శరీర ఊబకాయాన్ని ,కీళ్ల నొప్పులను, థైరాయిడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో కూడా మంచి మేలు చేస్తాయి. By Bhavana 16 Nov 2023 in లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి నువ్వులు..ఇందులో కాల్షియం, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండు రకాలు...ఒకటి తెల్ల నువ్వులు..రెండు నల్ల నువ్వులు. తెల్ల నువ్వులు బాగా పాలిష్ చేయడం వల్ల కాల్షియం స్థాయి తగ్గుతుంది. కానీ పై పొర పోకుండా ఉన్న నువ్వుల్లో మెగ్నీషియం, మాంగనీస్, జింక్ పుష్కలంగా ఉంటాయి. నువ్వులు ఎముకల బలహీనతలను నివారించడంలో మంచి ఔషధంగా పని చేస్తాయి. చిన్న పిల్లలు బలంగా ఉండటానికి నువ్వులు మంచి మేలు చేస్తాయి. శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లను తగ్గించడంలో సాయపడుతుంది. రక్తపోటును, శరీర ఊబకాయాన్ని ,కీళ్ల నొప్పులను, థైరాయిడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో కూడా మంచి మేలు చేస్తాయి. సో ఇన్ని ప్రయోజనాలున్న తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులే బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నల్ల నువ్వులు పై తొక్క ఉంటుంది. కాల్షియం పుష్కలంగా ఉంటుంది. చలికాలంలో తెల్లనువ్వుల కంటే నల్ల నువ్వుల లడ్డూ, చిక్కీ తినడం వల్ల ఎముకలకు చాలా మంచిది. నల్ల నువ్వులు కరకరలాడుతూ, పెళుసుగా , రుచిగా ఉంటాయి. నల్ల నువ్వులపై ఉండే పొట్టు వల్ల సూక్ష్మ పోషకాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. నల్ల నువ్వుల్లో ఎక్కువగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. దీని వల్ల గుండెతో పాటు ఇతర అవయవాలను కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా నల్ల నువ్వుల్లో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నల్ల నువ్వులు అనేక వృద్ధాప్య వ్యాధుల నుంచి కూడా కాపాడుతాయి. చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు ఇతర వ్యాధుల బారిన పడకుండా నల్ల నువ్వులు మేలు చేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో శరీరం సులభంగా వ్యాధులతో పోరాడుతుంది. జ్ఞాపకశక్తి, మెదడు పని సామర్థ్యం పెరుగుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. Also read: రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్ ని ఎంజాయ్ చేశా: సత్య నాదెళ్ల! #winter #black-nuvvullu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి