Best Foods: కంటి చూపును మెరుగు పరిచే ఆహారాలు!

పోషకాహార లోపంతోనే ఎక్కువ మంది చూపు సమస్యలకు గురవుతున్నారు. కంటి చూపుని మెరుగుపరచడంలో చిలకడ దుంపలు ఆకుకూరలను చేర్చుకోవడం కూడా కళ్లకు ఎంతో మేలు చేస్తుంది.ఈ క్రమంలోని కంటిచూపును మెరుగుపరిచే ఈ ఆహారాల పోషక విలువలు మనం తెలుసుకుందాం.

Best Foods: కంటి చూపును మెరుగు పరిచే ఆహారాలు!
New Update

Best Foods to Improve Eye Sight: ప్రస్తుత కాలంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా కంటి సమస్యలతో బాధ పడుతున్నారు. చిన్న వయస్సు నుండే దృష్టి సమస్యలతో కళ్ళజోడు వాడాల్సిన పరిస్థితికి వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పోషకాహార లోపం.కంటి చూపుని మెరుగుపరచడంలో చిలకడ దుంపలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును పెంచుతాయి.

ఇక రోజువారి ఆహారంలో మనం ఆకుకూరలను చేర్చుకోవడం కూడా కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. ఆకుపచ్చని పాలకూర, బచ్చలి కూర, తోటకూర వంటి ఆకుకూరలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఆకుకూరలు ఎక్కువగా తినటం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అంతేకాదు ఉసిరికాయలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.ఇక నారింజ, బత్తాయి కూడా కంటి చూపును మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. ఆకుకూరలు, పండ్లు విటమిన్ ఏ ఎక్కువగా ఉండేవి తినటం కళ్ళకు మేలు చేస్తుంది.

Also Read: ఇంట్లో సమోసా తయారు చేయాలనుకుంటే..ఇలా ట్రై చేయండి!

#health-tips
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe