Mahashivratri 2024: మహాశివరాత్రి నాడు భక్తులు ఉపవాసం శివుడిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శివభక్తులు సోమవారాల్లో శివుడిని ఆరాధిస్తుంటారు. అయితే మహాశివరాత్రి నాడు నాలుగవ రాత్రి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఫాల్గున కృష్ణ చతుర్దశి తిథిలో మహాశివరాత్రి పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది మహాశివరాత్రి నాడు సర్వార్థసిద్ధితో కూడిన మూడు శుభయోగాలు కలువబోతున్నాయి. ఆరోజు శ్రావణి, ధనిష్ట నక్షత్రాలు ఉంటాయి. శివరాత్రి నాడు శివభక్తులు ఉపవాసం ఉండి..ఆచార వ్యవహారాలతో పూజలు చేస్తుంటారు. శివభక్తులు సోమవారాల్లో శివుడిని పూజిస్తుంటారు. అయితే శివరాత్రి నాడు నాలుగవ రాత్రి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనికి అనుకూలమైన సమయాన్ని మనం గమనించాలి. ఈ ఏడాది మహాశివరాత్రి ఏ రోజు, శుభ సమయం ఏదో తెలుసుకుందాం.
మహాశివరాత్రి ఈ ఏడాది ఫాల్గుణ కృష్ణ చతుర్దశి తిథి మార్చి 8వ తేదీ శుక్రవారం రాత్రి 9.57 గంటలకు ప్రారంభమై మార్చి 9వ తేదీ వరకు కొనసాగుతుంది. మార్చి 8వ తేదీన మహాశివరాత్రి జరుపుకోనున్నారు.శివరాత్రి పూజకు సమయం మధ్యాహ్నం 12.07 నుండి 12.56 వరకు అనుకూల సమయం ఉంది. రాత్రిపూజ చేయకూడదనుకునే వారు బ్రహ్మ ముహూర్తం నుండి ఏ సమయంలోనైనా చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. మహాశివరాత్రి రోజున ఉదయం 5.01 గంటల నుండి 5.50 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఐఎన్‌ఎల్డీ అధ్యక్షుడిపై పట్టపగలే కాల్పులు,నఫే సింగ్ సహా కార్యకర్త మృతి.!