WhatsApp: నయా ఫీచర్ తో ముందుకు వస్తున్న వాట్సప్!

కొన్ని కారణాల వల్ల వాట్సప్‌ వాయిస్‌ మెసేజ్​లను కొన్ని సందర్భాల్లో వినలేం. దీనికి చెక్​ పెట్టేందుకే వాయిస్​ సందేశాలను టెక్ట్స్‌ రూపంలోకి మార్చుకునేలా వాట్సప్‌ సరికొత్త ఫీచర్‌ను తెచ్చేందుకు రెడీ అవుతోంది.

New Update
WhatsApp: నయా ఫీచర్ తో ముందుకు వస్తున్న వాట్సప్!

WhatsApp New Feature: ప్రముఖ మెసేజింగ్​ ప్లాట్​ఫామ్​ వాట్సాప్ తమ యూజర్ల కోసం 'వాయిస్​ నోట్ ట్రాన్స్​క్రిప్షన్' పేరిట​ ఓ సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వాయిస్​ మెసేజ్​లను టెక్ట్స్​ రూపంలోకి మార్చుకోవచ్చు. వాట్సప్‌ వాయిస్‌ మెసేజ్​లను కొన్ని సందర్భాల్లో వినలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాటప్పుడు వాయిస్ మెసేజ్​లను, టెక్ట్స్‌ రూపంలోకి మార్చుకొని చదువుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

స్నేహితులు, కుటుంబ సభ్యులకు లెంగ్తీ మెసేజ్​లు పంపాలనుకున్నప్పుడు వాట్సప్‌ వాయిస్‌ మెసేజ్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే దీంట్లో కొన్ని పరిమితులు ఉన్నాయి. వాయిస్‌ నోట్‌ అందినప్పటికీ, వివిధ కారణాల వల్ల దానిని ప్లే చేసి వినలేని పరిస్థితి ఏర్పడవచ్చు. దీనికి పరిష్కారంగానే వాయిస్​ సందేశాన్ని టెక్ట్స్‌ రూపంలోకి మార్చుకొని చదివి, దానికి రిప్లై ఇచ్చేలా ఓ కొత్త ఫీచర్‌ను వాట్సప్​ సిద్ధం చేసింది.

వినకుండానే మెసేజ్‌కు రిప్లైవాయిస్‌ నోట్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌ ఫీచర్​ సాయంతో వాయిస్‌ మెసేజ్‌లను టెక్ట్స్‌ రూపంలోకి మార్చుకోవచ్చు. కనుక వాయిస్​ మెసేజ్​ను ఓపెన్​ చేసి వినాల్సిన అవసరం ఉండదు. కేవలం టెక్స్ట్​ రూపంలోని మెసేజ్​ను చదివి రిప్లై ఇవ్వవచ్చు. ఈ నయా ఫీచర్​ను వాట్సప్‌ ఇప్పటికే కొంతమంది ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే ఆండ్రాయిడ్‌ యూజర్లకు కూడా ఈ ఫీచర్​ అందుబాటులోకి రానుంది.

ఈ కొత్త ఫీచర్‌ను వాడాలంటే, వాట్సాప్​ యూజర్లు అదనంగా 150ఎంబీ యాప్‌ డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాయిస్‌ నోట్స్‌ను టెక్ట్స్‌లోకి మార్చడానికి డివైజ్‌ స్పీచ్‌ రికగ్నిషన్‌ ఫీచర్లను వాట్సప్‌ వాడుకోనుంది. ఫలితంగా ట్రాన్‌స్క్రిప్షన్‌ డివైజ్‌లోనే జరుగుతుంది. దీని వల్ల యూజర్లకు ఎలాంటి ప్రైవసీ ఇబ్బందులు ఏర్పడవు! ఈ ఫీచర్‌ను వినియోగించేవారికి మెసేజ్‌ బబుల్స్‌లో, వాయిస్‌ నోట్స్‌ టెక్ట్స్‌ రూపంలో కనిపిస్తుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ నయా ఫీచర్‌, త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

చాట్‌లోనే క్యూఆర్‌ కోడ్‌ వాట్సప్‌ వీడియో స్టేటస్‌ అప్‌డేట్స్‌, వాట్సాప్​ పేమెంట్స్ విషయంలోనూ మెటా పలు కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న 30 సెకెన్ల వీడియో స్టేటస్​ లిమిట్​ను ఒక నిమిషానికి పెంచే విధంగా కసరత్తు చేస్తోంది. పేమెంట్స్‌ను మరింత సులభతరం చేసేలా, చాట్‌ లిస్ట్‌లోనే క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ కనిపించే విధంగా మార్పులు చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు