WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్.. ఒకే యాప్‌లో రెండు అకౌంట్స్ యూజ్ చేయొచ్చు.. అదెలాగంటే..

వాట్సాప్ తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఫీచర్ ను తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ మొబైల్ ఫోన్ లో ఒక వాట్సాప్ నుంచి రెండు వాట్సాప్ అకౌంట్లను ఉపయోగించవచ్చు. ఇందుకోసం వినియోగదారుల వద్ద డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేసే ఫోన్ ఒక్కటి ఉంటే సరిపోతుంది.

New Update
WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్.. ఒకే యాప్‌లో రెండు అకౌంట్స్ యూజ్ చేయొచ్చు.. అదెలాగంటే..

One Phone Two WhatsApp Accounts: ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులు.. తమ ఫోన్లలో రెండు వేర్వేరు వాట్సాప్ ఖాతాలను ఉపయోగించడానికి డ్యూయల్ లేదా క్లోన్ యాప్ ఫీచర్‌ను ఉపయోగించాల్సి వచ్చేది. అయితే, ఇక నుంచి ఆ అవసరం లేదు. మేటా యాజమాన్యంలోని వాట్సాప్.. తన వినియోగదారులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు.. న్యూ ఫీచర్‌ను తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఒకే వాట్సాప్ అకౌంట్‌లో రెండు మొబైల్ నెంబర్‌లను ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్‌కు సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వాట్సాప్ యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి మేసేజింగ్ యాప్.. అనేక ఫీచర్లను విడుదల చేస్తోంది. ఇటీవల కొత్త అప్‌డేట్‌లో చాట్ లాక్, హెచ్‌డి ఫోటో ఆప్షన్, మేసేజ్‌లను ఎడిట్ చేయడం, స్క్రీన్ షేరింగ్ మొదలైన కొత్త ఫీచర్లను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తోంది. ఈ ఫీచర్లు.. ప్రజలను వాట్సాప్‌కు మరింత చేరువ చేశాయి. ఇప్పుడు, వాట్సాప్ మరో అనూహ్యమైన ఫీచర్‌ను తీసుకువస్తుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. ఒకే యాప్‌లో రెండు మొబైల్ నంబర్‌లను ఉపయోగించవచ్చు.

ఇంతకుముందు యూజర్లు.. ఒక స్మార్ట్‌ఫోన్‌లో రెండు వేర్వేరు వాట్సాప్ అకౌంట్స్‌ని ఉపయోగించడానికి డ్యూయల్ లేదా క్లోన్ యాప్ ఫీచర్‌ను ఉపయోగించాల్సి వచ్చేది. ఇక ఇప్పటి నుంచి ఆ అవసరం లేదు. కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే.. ఒక వాట్సాప్ అప్లికేషన్‌లో రెండు మొబైల్ నంబర్‌లను ఉపయోగించవచ్చు. దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం.

వాట్సాప్ యాజమాన్యం ప్రకటించిన సమాచారం ప్రకారం.. వాట్సాప్ యాప్‌లో రెండవ అకౌంట్ క్రియేట్ చేయడం చాలా సులభం. ఇందుకోసం మీ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ కలిగి ఉంటే సరిపోతుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక.. ప్రొఫైన్ నేమ్ పక్కనే బాణం సింబల్ ఇస్తారు. దానిపై క్లిక్ చేయడం ద్వారా.. రెండ అకౌంట్‌ను క్రియేట్ చేయొచ్చని చెబుతోంది వాట్సాప్. ఇక ప్రతి అకౌంట్‌కు సంబంధించిన సెక్యూరిటీ, నోటిపికేషన్ సెట్టింగ్స్‌పై పూర్తి నియంత్రణ సదరు వాట్సాప్ యూజర్లకే ఉంటుందని సంస్థ ప్రకటించింది.

కాగా, మేటా యాజమాన్యం ప్రకటించిన ఈ వాట్సాప్ ఫీచర్ మరికొద్ది రోజుల్లో అంటే.. అక్టోబరు చివరి నాటికి గానీ.. నవంబర్ మొదటి వారంలో గానీ విడుదల అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం, వాట్సాప్ బీటా టెస్టర్లు ఈ ఫీచర్‌ని ఉపయోగించడం ప్రారంభించవచ్చు. ఈ ఫీచర్ మొదట వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్‌లో వస్తుంది.

వాయిస్ నోట్స్‌లో 'వ్యూ వన్స్' ఫీచర్..

ఇన్‌స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ తన iOS, Android వినియోగదారుల కోసం వాయిస్ నోట్స్‌లో 'వ్యూ వన్స్' ఫీచర్‌ను విడుదల చేస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉంది. రాబోయే రోజుల్లో వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. యాప్‌లో ఎవరికైనా ఫోటోలు, వీడియోలను పంపేటప్పుడు వాట్సాప్ వినియోగదారులు ఇప్పటికే 'వ్యూ వన్స్' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ఫీచర్ వాయిస్ నోట్స్‌కు కూడా రానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు