WhatsApp: వాట్సాప్‌లో మరో ప్రత్యేకమైన ఫీచర్‌.. ఇన్-యాప్ డయలర్ అందుబాటులోకి..!

వాట్సాప్‌ తమ వినియోగదారుల కోసం మరో ప్రత్యేక ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఇన్-యాప్ డయలర్ ఫీచర్ అందుబాటులోకి తెస్తోంది. ఇన్-యాప్ డయలర్ ద్వారా వాట్సాప్‌లోనే నేరుగా నంబర్‌ను డయల్ చేసి కాల్ చేసే సౌకర్యం ఉంటుంది.

New Update
WhatsApp: వాట్సాప్‌లో మరో ప్రత్యేకమైన  ఫీచర్‌.. ఇన్-యాప్ డయలర్ అందుబాటులోకి..!

 WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ల సౌకర్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడు కంపెనీ వినియోగదారుల కోసం మరో ప్రత్యేక ఫీచర్‌ను తీసుకురాబోతోంది. వాట్సాప్‌లో కొత్త ఇన్-యాప్ డయలర్ ఫీచర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌తో వినియోగదారుల సమస్యకు పరిష్కారం లభించనుంది. ఇన్ డయలర్ ఫీచర్ విషయానికొస్తే.. గతంలో కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న నెంబర్స్ కు మాత్రమే వాట్సాప్ కాల్ చేసే అవకాశం ఉండేది. ఏదైనా కొత్త నెంబర్ కు కాల్ చేయాలంటే ముందుగా ఆ నెంబర్ ను కాంటాక్ట్ లిస్ట్ లోకి యాడ్ చేసిన తర్వాతే వాట్సాప్‌లో పేరు కనిపించింది. అప్పుడు మాత్రమే వాట్సాప్ కాల్ చేసే వీలు ఉండేది.

అయితే ఇప్పుడు వాట్సాప్ లో ఇన్-యాప్ డయలర్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, వాట్సాప్ నుంచే నేరుగా నంబర్‌ను డయల్ చేయడం ద్వారా ఏ నంబర్‌కైనా కాల్స్ చేయవచ్చు.

publive-image

ఈ ఫీచర్‌లో, ఫోన్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, వినియోగదారులు దాన్ని నేరుగా చిరునామా పుస్తకంలో కొత్త కాంటాక్ట్‌గా సేవ్ చేసేలా లేదా ఇప్పటికే ఉన్న కాంటాక్ట్‌కి జోడించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఫోన్ డయల్‌ప్యాడ్‌ పనిచేసే విధంగానే పని చేస్తుంది. డయలర్ స్క్రీన్‌లో మెసేజింగ్ షార్ట్‌కట్ కూడా అందుబాటులో ఉందని చెప్పబడింది. ఇది వినియోగదారులు డయల్ చేయాలనుకున్న ఫోన్ నంబర్‌కు వెంటనే సందేశాన్ని పంపడానికి అనుమతిస్తుంది.

Google Play Store నుంచి Android కోసం WhatsApp బీటా తాజా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్‌లకు ఈ కొత్త ఇన్-యాప్ డయలర్ ఫీచర్ అందుబాటులో ఉందని. రాబోయే రోజుల్లో మరింత మందికి అందుబాటులోకి వస్తుందని సమాచారం.

Also Read: Pregnancy: ప్రెగ్నెన్సీలో సీటు బెల్ట్ పెట్టుకుంటే ఏమవుతుంది..? ఎలా ధరించాలి..? - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు