హైబీపీ తో బాధపడుతున్నవారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి!

ఈరోజుల్లో హైబీపీ లేదా హైపర్‌టెన్షన్ సమస్య చాలామందిలో కనిపిస్తుంది. ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటే పలు రకాల గుండె జబ్బులకు దారి తీస్తుంది. కాబట్టి హైబీపీని ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకోవాలి. దీనికోసం డైట్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

New Update
హైబీపీ తో బాధపడుతున్నవారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి!

Best Food for High Blood Pressure: హైబీపీ ఉన్నవాళ్లలో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరిస్తుంది. దీనివల్ల గుండె, మెదడుపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది మరింత ఎక్కువైతే ఇతర అవయవాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి హై బీపీ ఉన్నవాళ్లు ఒత్తిడి లేని జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి. అలాగే తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

నిజం ఇదే హైపర్ టెన్షన్ ఉన్నవాళ్లు రోజూ పొద్దున్నే గోరువెచ్చటి నీటిలో నిమ్మరసాన్ని కలుపుకుని తాగడం అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు వల్ల శరీరంలో యాంటీఆక్సిడెంట్స్ పెరిగి.. రక్తనాళాలు వదులుగా తయారవుతాయి. తద్వారా రక్తపోటు పెరగకుండా ఉంటుంది. నిమ్మరసంలో (Lemon Water) తేనె కలుపుకుంటే ఇంకా మంచిది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు వీలున్నప్పుడల్లా కొబ్బరి నీళ్లు తాగుతుంటే.. క్రమంగా బీపీ తగ్గుముఖం పడుతుంది. కొబ్బరినీళ్లలో (Coconut Water) ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ రక్తపోటును తగ్గించడంలో సాయపడతాయి.

Also Read: మరోసారి డీప్ ఫేక్ బారిన పడ్డ రష్మిక మందన.. వైరల్ అవుతున్న బికినీ వీడియో !

ప్రతిరోజూ మెంతులు నానబెట్టిన నీళ్లు తాగడం ద్వారా బీపీ పెరగకుండా ఉంటుంది. అంతేకాదు డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఈ నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. మెంతులు రక్తంలో షుగర్ లెవల్స్‌ను కూడా కంట్రోల్ చేస్తాయి. రోజుకో అరటిపండు తినడం, ఉల్లిపాయలు, అల్లం వంటివి రోజువారీ కూరల్లో వాడుకోవడం ద్వారా కూడా హైపర్ టెన్షన్ అదుపులో ఉంటుంది. అలాగే కూరల్లో ఉప్పు తగ్గించడం కూడా చాలా ముఖ్యం. ఇక వీటితోపాటు ఒబెసిటీ, నిద్రలేమి, జంక్ ఫుడ్, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వంటివి కూడా రక్తపోటు పెరిగేలా చేస్తాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హైపర్ టెన్షన్ ఉన్నవాళ్లు ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.

Advertisment
Advertisment
తాజా కథనాలు