Article 370 Explained: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిపిన ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. పార్లమెంటు నిర్ణయాన్ని కొట్టివేయలేమని.. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాగంబద్ధమే అంటూ స్పష్టం చేసింది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని.. ఆర్టికల్ 370 అనేది యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని తెలిపింది. జమ్మూ కశ్మీర్‌కు సార్వభౌమాదికారం లేదని.. భారత రాజ్యాంగమే ఫైనల్ అని జమ్ము కశ్మీర్ రాజు కూడా ఆనాడు ఒప్పందం చేసుకున్నారని వివరించింది. అలాగే ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదని చెప్పింది. ఆర్టికల్ 370 రద్దుపై రాష్ట్రపతి ఉత్తర్వులు సమర్ధనీయమే అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాగే ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రహోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అంతేకాదు 2024 సెప్టెంబర్ 30 లోగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఆర్టికల్ 370 అంటే ఏమిటి? ఇది ఎందుకు రద్దు చేశారు? రద్దు ఎలా జరిగింది అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Article 370 Explained: సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 రద్దును సమర్ధించింది.. అసలు ఈ ఆర్టికల్ ఏమిటో తెలుసా?
ఆర్టికల్ 370 అంటే ఏమిటి? దీనివలన జమ్మూ- కాశ్మీర్ కు వచ్చిన ప్రత్యేక అధికారాలు ఏమిటి? ఈ ఆర్టికల్ రద్దు ఎలా జరిగింది? ఈ వివరాలన్నిటినీ హెడింగ్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
Translate this News: