/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/jagannath-rath-yatra.webp)
హిందూమతంలో, జగన్నాథుని తీర్థయాత్ర చాలా పవిత్రమైన కార్యంగా పరిగణిస్తారు. పంచాంగ ప్రకారం, జగన్నాథ యాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండవ తేదీన జరుపుకుంటారు. ఈసారి జగన్నాథయాత్ర మంగళవారం, జూన్ 23, 2023న జరగనుంది. ఈ పవిత్ర యాత్రలో జగన్నాథుడు మాత్రమే కాకుండా అతని అన్న బలరాముడు, సోదరి సుభద్ర కూడా రథయాత్రకు తీసుకెళ్తారు. జగన్నాథ రథయాత్రలో పాల్గొనడం ద్వారా అన్ని తీర్థయాత్రల ఫలాలు లభిస్తాయని మత విశ్వాసం. ఈయాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/jagannath-rath-yatra.webp)
జగన్నాథ రథయాత్రకు వివిధ పేర్లు:
మత విశ్వాసాల ప్రకారం, జగన్నాథుడు విష్ణువు అవతారంగా భావిస్తారు. ప్రతిఏడాది జరిగే ఈ రథయాత్రను శ్రీ జగన్నాథ పురి, పురుషోత్తమ పురి, శంఖ క్షేత్రం, శ్రీ క్షేత్రం అని పిలుస్తుంటారు. ఈ యాత్రలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్దెత్తున తరలివస్తుంటారు.
సుభద్ర కోరిక తీర్చేందుకు రథయాత్ర:
పురాణాల ప్రకారం, జగన్నాథుని సోదరి సుభద్ర ఒకసారి నగరం చుట్టూ తిరగాలనే కోరికను కోరుతుంది. అప్పుడు జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడిని అంటే బలరాముడిని రథంపై ఎక్కించుకుని నగరం మొత్తం చూపించాడట. అప్పటి నుండి ఈ రథయాత్రను జారీ చేసే సంప్రదాయం కొనసాగుతుందని భక్తుల నమ్మకం.
రథ నిర్మాణానికి కలప ఎంపిక:
వేప చెట్టు కలపను రథ నిర్మాణంలో ఉపయోగిస్తారు. ఈ ప్రత్యేకమైన చెక్కను దారు అంటారు. ఈ రథాన్ని నిర్మించేందుకు ఉత్తమమైన వేపను ఎంపిక చేసేందుకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఉత్తమమైన కలపను ఎంపిక చేసిన తర్వాతే ఆ చెక్కతో రథం నిర్మాణం జరుగుతుంది.
జగన్నాథునికి జలాభిషేకం:
జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జగన్నాథుడికి 108 కలశల నీటితో అభిషేకం చేస్తారు. ఇందులో మనం గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, జగన్నాథుని అభిషేకానికి ఉపయోగించే నీటిబావిని సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరుస్తారు. అందుకే ఈ యాత్రను స్నాన్ యాత్ర అనికూడా పిలుస్తుంటారట. ఈ యాత్ర తరువాత, భగవంతుడు 15 రోజుల ఏకాంతాన్ని తీసుకుంటాడు.
రథయాత్రలో తన అత్తగారింటికి జగన్నాథుడు:
ఈ రథయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల దర్శనం తర్వాత గుండిచా ఆలయానికి చేరుకుంటారు. ఇది అతని అత్తగారిల్లుగా నమ్ముతారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత, భగవంతుడు తన మాతృమూర్తి తయారుచేసిన రుచికరమైన వంటకాలను స్వీకరిస్తాడు. దీని తరువాత అతను ఏడు రోజుల పాటు ఈ ఆలయంలో విశ్రాంతి తీసుకుంటాడు.
Follow Us