Explainer: మహిళలను లైంగికంగా, ఘోరంగా, క్రూరంగా హింసించిన రాక్షసుల కథ ఇది.. అసలేంటి సందేశ్‌ఖాలీ వివాదం? కోల్‌కతాకు 100 కిలోమీటర్ల దూరంలో సుందర్‌బన్స్ సరిహద్దుల్లో ఉన్న సందేశ్‌ఖాలీ అనే ప్రాంతముంది. TMC నాయకుడు షాజహాన్‌పై నిరసనలతో నెల రోజులకు పైగా ఉడికిపోతోంది. ఇంతకి అతను చేసిన ఘోరాలేంటి? అసలు ఈ గొడవ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? మరింత సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Trinath 24 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి What is SandeshKhali issue: పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బసిర్హత్ సబ్ డివిజన్‌లో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు సందేశ్‌ఖాలీ. ఇది సముద్రపు దొంగలు ఎక్కువగా టార్గెట్ చేసే ఊరు అది. క్రైమ్ కూడా చాలా ఎక్కువే. ముఖ్యంగా మహిళల అక్రమ రవాణా ఇక్కడ ఎక్కువగా జరుగుతుందని చెబుతుంటారు. ఈ ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం 100 మందికి పైగా మహిళలు ముంబై, పూణేలోని రెడ్ లైట్ ప్రాంతాలకు అక్రమ రవాణా అవుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి ఊరిలో క్రైమ్‌ని అరికట్టాల్సిన అధికార పార్టీ నేతలు అది చేయడం మానేసి.. వారే ఘోరమైన నేరాలకు పాల్పడ్డారు. అందుకే కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సందేశ్‌ఖాలీ పేరు మారుమోగుతుంది. స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్, అతని మద్దతుదారులపై గ్రామంలోని మహిళలు సంచలన ఆరోపణలు చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళంతా మూకుమ్మడిగా న్యాయ పోరాటానికి దిగడం ప్రకంపనలు రేపింది. అప్పటి నుంచి ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. I met #ShabanaAzmi at the airport. Before she could do anything I put my finger down her throat. Nothing! I did it twice but she didn't throw up. Ulti nahi aa rahi, I asked her. She said "No, Bilkis Bano is Muslim, isliye aa rahi thi. #Sandeshkhali women are Hindu so maza aa… pic.twitter.com/phniki2nlT — Eminent Intellectual (@total_woke_) February 24, 2024 వాడో కామాంధుడు: అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు ఎత్తుకుపోతారు.. లైంగికంగా అనుభవించి వదిలేస్తారు. చెప్పింది చేయకపోతే చిత్రహింసలు పెడతారు. అందమైన మహిళలను ఇంటింటికీ వెతికి, ఆపై వారిని ఎత్తుకుని పార్టీ కార్యాలయానికి తీసుకెళ్తారు. ఆ ఊర్లో షేక్ షాజహాన్ అంటే చాలా భయపడని మహిళ ఉండేది కాదు.. ఎవరికైనా అతని వికృత చేష్టలు గురించి చెప్పినా, గొంతు ఎత్తినా వారి బతుకు అక్కడితో ఆగిపోయినట్టే లెక్కా.. అంతలా భయపెట్టిన షాజహాన్‌పై మహిళలు తిరగబడ్డారు.. న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటున్నారు. Women in large numbers joined the candle march protest at kolkata over the #Sandeshkhali incident. So far, the main accused and Criminal Shahjahan Sheikh hasn’t arrested. This shows he enjoy the support of the CM @MamataOfficial. Women came out in large numbers to demand his… pic.twitter.com/pL4JPPJPbK — Vanathi Srinivasan (@VanathiBJP) February 24, 2024 ఈడీ రాక తర్వాత మారిన సీన్: సందేశ్‌ఖలీకి చెందిన మహిళల మాటలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. నిజానికి ఈడీ(ED) చర్య తర్వాత సందేశ్‌ఖాలీలో ఏం జరుగుతుందో ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. రేషన్ అవినీతి కేసులో తృణమూల్ నాయకుడు షేక్ షాజహాన్‌ను విచారించడానికి జనవరి 5, 2024న ఈడీ అధికారులు సందేశ్‌ఖాలీలోని సర్బేడియాకు చేరుకుంది. ఆ సమయంలో షేక్ షాజహాన్ అక్కడ లేరు. ఇక ఈ క్రమంలో అధికారులపై దాడులు జరిగాయి. ఈ ఘటన తర్వాత ప్రజలు తమ స్వరం పెంచి బహిరంగంగా ముందుకు వచ్చారు. షేక్ షాజహాన్, అతని సహచరులను అరెస్టు చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేవారు. అప్పటి నుంచి నిరసనలు చేస్తున్నారు. సందేశ్‌ఖాలీలో నిరసనలు ఆరోపణలు ఏంటి? సందేశ్‌ఖాలీకి చెందిన మహిళలు షేక్ షాజహాన్‌పై లైంగిక వేధింపులు, భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒకానొక సమయంలో షాజహాన్‌పై గ్రామస్తులు యుద్ధానికి దిగారు. షాజహాన్ సన్నిహితుడు, టీఎంసీ నేత శిబు హజ్రా వ్యవసాయ క్షేత్రానికి, పౌల్ట్రీ ఫారానికి నిప్పంటించారు. గ్రామస్తుల నుంచి భూమిని లాక్కొని అక్రమంగా పౌల్ట్రీ ఫారం నిర్మించారని ఆరోపించారు. People of #Sandeshkhali have been systematically oppressed by @AITCofficial -backed goons for years now. @MamataOfficial , you can turn a blind eye to the facts, but know that the people are rising...You cannot suppress the roars of the people...#SandeshkaliHorror #Sandeshkhali pic.twitter.com/vcQ1K0N2cx — Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) February 24, 2024 గిరిజనలు ర్యాలీతో మొదలైన నిరసనలు: ఈ నిరసనలు బెంగాల్‌కు రావాల్సిన నిధులను కేంద్రం లాక్కుందని ఆరోపిస్తూ తృణమూల్ సందేశ్‌ఖాలీలోని త్రిమోహని మార్కెట్‌లో గిరిజన సంఘంలోని ఒక వర్గంతో ర్యాలీని చేపట్టింది. సందేశ్‌ఖాలీలో మొదలైన నిరసన ర్యాలీలు క్రమంగా తీవ్ర రూపం దాల్చాయి. ఇదే సమయంలో మహిళలు కర్రలతో రోడ్లపైకి వచ్చారు. స్థానిక తృణమూల్ నాయకుడు షేక్ షాజహాన్, బ్లాక్ ప్రెసిడెంట్ శివప్రసాద్ హజ్రా, అతని సహచరుడు ఉత్తమ్ సర్దార్‌లను అరెస్టు చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. తమపై షాజహాన్ ఎలాంటి దారుణాలకు పాల్పడ్డాడో దేశానికి తెలిసివచ్చేలా చేశారు. The Truth of #Sandeshkhali. Please take out 20 minutes to watch this. And share widely to wake those who are still asleep. pic.twitter.com/s0xSNfbfwV — Abhijit Majumder (@abhijitmajumder) February 22, 2024 కొనసాగుతోన్న విచారణ: సందేశ్‌ఖాలీ అంశంపై బీజేపీ, టీఎంసీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. అటు నిరసనలో భాగంగా సందేశ్‌ఖాలీలో జరిగిన హింసాకాండ, లైంగిక వేధింపుల ఘటనలపై విచారణకు బీజేపీ ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర మంత్రులు, ఆరుగురు పార్లమెంటు సభ్యులు ఉన్నారు. అత్యున్నత స్థాయి కమిటీ కన్వీనర్‌గా కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవిని నియమించారు. ప్యానెల్‌లోని ఇతర సభ్యుల్లో ప్రతిమా భౌమిక్, బీజేపీ ఎంపీ సునీతా దుగ్గల్, కవితా పటీదార్, సంగీత యాదవ్, బ్రిజ్‌లాల్ ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులో షేక్ షాజహాన్ పరారీలో ఉండగా.. టీఎంసీ నేత శివప్రసాద్ సహా 18 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. Also Read: పిల్లలను ఆకలితో మాడ్చి మాడ్చి హింసించింది.. ప్రముఖ య్యూటుబర్‌కు 60ఏళ్లు జైలు శిక్ష! #sandeshkhali మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి