Pradhan Mantri Suryoday Yojana: ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన పథకం అంటే ఏంటి..ఇక కరెంటు బిల్లుల నుంచి విముక్తి..!!

అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ ప్రధాన మంత్రి సూర్యోదయ యోజనను ప్రకటించారు.దీని కింద దేశంలోని కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ఎనర్జీ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు.

New Update
Pradhan Mantri Suryoday Yojana: ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన పథకం అంటే ఏంటి..ఇక కరెంటు బిల్లుల నుంచి విముక్తి..!!

Pradhan Mantri Suryoday Yojana:  దేశంలోని ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. అలాంటి ఒక పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయోధ్యలో రామమందిరం (ramamandir) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన (Pradhan Mantri Suryoday Yojana)ను ప్రకటించారు. దీని కింద దేశంలోని కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ఎనర్జీ (Solar energy0ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి కార్యక్రమాన్ని రూపొందించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన కూడా సమావేశం జరిగింది. ఈ పథకం ఎవరికి లభిస్తుంది. దాని నియమాలు ఏమిటో ఈ రోజు మేము మీకు తెలియజేస్తున్నాము.

ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన ద్వారా, భారతీయులు వారి ఇళ్లపై వారి స్వంత సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థను కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అయోధ్య నుండి తిరిగి వచ్చిన తర్వాత, నేను తీసుకున్న మొదటి నిర్ణయం ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన కింద 1 కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది పేద, మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాకుండా, ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబన దిశగా అడుగులు వేయిస్తుంది.

ఈ పథకం కింద ప్రయోజనాలు ఎవరు పొందుతారు?
దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల కోసం ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన ప్రారంభం కానుంది. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఈ పథకం కిందకు వస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని, అయితే రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం కోటి మందిని ఈ పథకం కిందకు తీసుకురానున్నారు. సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసిన తర్వాత, ప్రజలు విద్యుత్ బిల్లుల టెన్షన్ నుండి విముక్తి పొందుతారు. విద్యుత్తు చాలా ఖరీదు ఉన్న రాష్ట్రాల ప్రజలు ఈ పథకం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందే వీలుంది.

ఇది కూడా చదవండి: పార్టీ కార్యకర్తలను జో కొట్టడానికే పవన్ ఇలా చేశాడు.. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా: పేర్ని నాని

Advertisment
తాజా కథనాలు