NoroVirus: అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నోరో వైరస్.. ఎంత ప్రమాదకరమైనది..దాని లక్షణాలేంటి!

అమెరికాలో మరో కొత్త వైరస్‌ మరోసారి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ కొత్త వైరస్‌ పేరు నోరో వైరస్‌. దీన్నే వింటర్ వామిటింగ్‌ బగ్‌ , స్టమాక్‌ ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి వాంతులు, విరేచనాలు వంటి సమస్యలను ఎదుర్కొంటాడు.

New Update
NoroVirus: అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నోరో వైరస్.. ఎంత ప్రమాదకరమైనది..దాని లక్షణాలేంటి!

NoroVirus in US: ఇప్పుడిప్పుడే చైనా నుంచి వచ్చిన కరోనా ప్రపంచాన్ని విడిచి పెట్టి వెళ్లిన్నట్లుంది..ఈ సమయంలో అమెరికాలో (America) కొత్త మరోసారి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ కొత్త వైరస్‌ పేరు నోరో వైరస్‌. దీన్నే వింటర్ వామిటింగ్‌ బగ్‌ (Winter Vomiting Bug) , స్టమాక్‌ ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి వాంతులు (Womits), విరేచనాలు వంటి సమస్యలను ఎదుర్కొంటాడు.

సాధారణంగా 'నోరోవైరస్'గా (NoroVirus) పిలిచే ఈ వైరస్‌ ప్రస్తుతం అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో వేగంగా విస్తరిస్తున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. డిసెంబర్ 2023 నుండి నోరోవైరస్ కేసులు వేగంగా పుట్టుకొస్తున్నాయి.

నోరోవైరస్‌ లక్షణాలు
సీడీసీ తెలిపిన వివరాల ప్రకారం, అమెరికాలో నమోదు అవుతున్న నోరోవైరస్ కేసులలో వాంతులు, విరేచనాలు, కడుపు పెద్దగా పెరగడం, ప్రేగులలో వాపు, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్, తినడం, త్రాగడానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఈ వ్యాధి ఏ వయస్సు వారికైనా సోకుతుంది.

ఈ వైరస్ చాలా త్వరగా, సులభంగా వ్యాపిస్తుంది. CDC (Centers for Disease Control and Prevention) మార్గదర్శకాల ప్రకారం, నోరోవైరస్ లక్షణాలు సాధారణంగా సంక్రమణ తర్వాత 12 నుండి 48 గంటల తర్వాత కనిపిస్తాయి. చాలా మంది వ్యక్తులు 1-3 రోజులలో కోలుకుంటారు. కానీ కొన్ని రోజులు మాత్రం అంటువ్యాధిగా సోకిన వారిలా ఉంటారు.

ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
ఇది సోకిన వ్యక్తి మలం, వాంతిలో విడుదలయ్యే చిన్న కణాల ద్వారా వ్యాపిస్తుంది. ఆహారం, తింటున్న వస్తువులను, పాత్రలను పంచుకోవడం, వైరస్ సోకిన వారు తయారుచేసిన ఆహారం తినడం వంటి వాటి వల్ల నోరో వైరస్ వ్యాపిస్తుంది.

ఎలా నివారించాలంటే..

నోరోవైరస్ వ్యాప్తి చెందకుండా పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇది వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, సబ్బుతో చేతులు బాగా కడగాలి. బట్టలు ఉతకడానికి వేడి నీటిని ఉపయోగించండి. బయటి ఆహారం తినడం మానుకోవాలి.

నోరోవైరస్ నుండి మరణం

CDC డేటా ప్రకారం, నోరోవైరస్ USలో సంవత్సరానికి 19 నుండి 21 మిలియన్ల అనారోగ్యాలకు కారణమవుతుంది. ఇందులో చాలా వరకు ఇన్ఫెక్షన్ కేసులు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం, నోరోవైరస్ వల్ల 109,000 మంది ఆసుపత్రిలో చేరడం వారిలో 900 మరణాలకు కారణమవుతుంది.

Also read: ఉల్లిపాయ యూరిక్‌ యాసిడ్ ని తగ్గిస్తుందా..?

Advertisment
తాజా కథనాలు