Twitter vs Threads: ట్విట్టర్‌కి థ్రెడ్స్ థ్రెట్..! రెండిటికి తేడా ఏంటి..ఏది బెస్ట్..? ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సరైన ప్రత్యర్థిగా విడుదలైన ‘మెటా థ్రెడ్స్’ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ యాప్ విడుదలైన కేవలం రెండు గంటల్లో 20 లక్షల మంది, 4 గంటల్లో 50 లక్షల మంది, 7 గంటల్లో కోటి కంటే ఎక్కువ మంది యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. By Trinath 08 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి ఏ నిమిషాన కొత్త సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్ థ్రెడ్స్ ఎంట్రీ ఇచ్చిందో కానీ అప్పటినుంచి దాని నామస్మరణతో సోషల్‌మీడియా మారుమోగిపోతోంది. ఎక్కడ చూసినా థ్రెడ్స్ గురించే డిస్కషన్. థ్రెడ్ దెబ్బకు ట్విట్టర్ పిట్ట మూతి ముడుచుకోని కుర్చుందని.. థ్రెడ్‌తో థ్రెట్ తప్పదని ఫిక్స్ ఐపోయిందని సోషల్‌మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఎన్నో సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు ట్విట్టర్‌కి పోటిగా వచ్చాయి..అయినా అంతటి క్రేజ్ మాత్రం తెచ్చుకోలేకపోయాయి. కానీ థ్రెడ్స్‌ని చూస్తే మాత్రం అలా అనిపించడంలేదు. సోషల్‌మీడియా మరో దిగ్గజం మెటా తీసుకొచ్చిన ఈ థ్రెడ్స్ ట్విట్టర్‌కి అసలుసిసలైన మొగుడు వచ్చేశాడని నెటిజన్లు కోడై కూస్తున్నారు. అందుకు బలమైన ఫ్రూఫ్‌లు కూడా కనిపిస్తున్నాయి. లాంచ్ అయిన ఏడు గంటల్లోనే కోటి యూజర్లు రిజిస్టర్ అయిన తొలి సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్ థ్రెడ్స్. ఇంతకీ ఈ థ్రెడ్స్ లాంగ్ రన్‌లో ట్విట్టర్‌కి పోటినివ్వగలదా..? అసలు ఈ రెండిటికి తేడా ఏంటి..? మార్క్ ( లెఫ్ట్), మస్క్( రైట్) (AI జనరేటెడ్ పిక్) ట్విట్టర్, థ్రెడ్స్‌కి డిఫరెన్స్‌లు ఇవే: 1) థ్రెడ్స్ అకౌంట్ నుంచి 500క్యారెక్టర్ కౌంట్ వరకు పోస్ట్ చేయొచ్చు. అదే ట్విట్టర్‌లో ఇది కేవలం280క్యారెక్టర్ల వరకే ఉంది 2) ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ బ్యాడ్జ్ ఉన్నవాళ్లు థ్రెడ్స్‌లో అదే బ్యాడ్జ్‌తో కొనసాగొచ్చు. అంటే కొత్తగా వెరిఫికేషన్ అవసరంలేదు. అటు ట్విట్టర్ ఇప్పటికే బ్లూ బ్యాడ్జ్ కోసం డబ్బులు తీసుకుంటుంది. 3) ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌నే థ్రెడ్స్‌లో వాడుకోవచ్చు. అటు ట్విట్టర్‌కి ప్రస్తుతానికి ఎలాంటి అనుసాంధానమైన ఫ్లాట్‌ఫామ్ లేదు. 4) వెరిఫై చేసుకోని అకౌంట్స్ కూడా థ్రెడ్స్‌లో ఐదు నిమిషాల లాంగ్ వీడియోలను షేర్ చేసుకోవచ్చు. కానీ, ట్విట్టర్‌లో బ్లూబ్యాడ్జ్ లేని వాళ్లు రెండు నిమిషాల 20 సెకెన్ల కంటే ఎక్కువ ఉన్న వీడియోలను పోస్ట్ చేయడానికి వీలుండదు. బ్లూ బ్యాడ్జ్ ఉన్న వాళ్లు రెండు గంటల వీడియోలు కూడా పోస్ట్ చేసే ఛాన్స్ ఉంది. 5) అటు థ్రెడ్స్‌లో యాడ్స్ లేవు.. ట్విట్టర్‌లో యాడ్స్ ఉంటాయి. 6) ఇలా అన్నీ థ్రెడ్స్‌కే ఫీచర్లు బెస్ట్ ఉన్నాయని అనుకోవద్దు.. ట్విట్టర్‌లో ఉన్నట్టు థ్రెడ్స్‌లో పోస్టులను సేవ్ చేసుకునే అవకాశం ప్రస్తుతానికి లేదు. థ్రెడ్స్ యాప్‌ను ఇలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి..?: 1) ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి థ్రెడ్స్,ఇన్‌స్టాగ్రామ్ యాప్ అని టైప్ చేసి యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. 2) అప్పుడు మీకు కింద ఇన్‌స్టాతో లాగిన్ అనే ఆప్షన్ పొందుతారు. 3) ఆ వెంటనే లాగిన్ కోడ్ మీ వాట్సాప్‌లో వస్తుంది. దాన్ని ఇక్కడ ఫిల్ చేయాలి. 4) ఇలా చేసిన తర్వాత 'ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఇంపోర్టు'పై క్లిక్ చేయండి. 5) ఇది ఇన్‌స్టా నుంచి మీ ప్రొఫైల్‌ను యాక్సెస్ చేస్తుంది. 6) స్క్రీన్ కింద చూపించే 'కంటిన్యూ' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. 7) నిబంధనలు, షరతులను చదవండి. 8) ఆ తర్వాత 'ఫాలో సమ్ అకౌంట్స్' క్లిక్ చేయండి. 9) ఇప్పుడు 'జాయిన్ థ్రెడ్స్' పై క్లిక్ చేయండి. యాపిల్ యూజర్లు కూడా ఇలానే చేయాలి థ్రెడ్స్ (ఫైల్) థ్రెడ్స్ తక్కువ సమయంలోనే ఎక్కువ డౌన్‌లోడ్‌లు సొంతం చేసుకోవడంతో ఎక్కడ చూసినా ఈ కొత్త సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌పైనే చర్చ జరుగుతోంది. థ్రెడ్స్ గురించి చాలా మంది ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. అందులో కొన్ని: 1) థ్రెడ్స్ యాప్ అంటే ఏంటి? ----> థ్రెడ్స్ అనేది టెక్ట్స్ అప్‌డేట్‌లను షేర్ చేయడం, పబ్లిక్ కన్వర్జేషన్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్ టీమ్ రూపొందించిన కొత్త యాప్. దీన్ని మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఉపయోగించి లాగిన్ చేయవచ్చు. ఇందులో పోస్ట్‌లు 500 అక్షరాల వరకు ఉంటాయి. అంతే కాదు దీని ద్వారా 5 నిమిషాల నిడివిలో లింక్‌లు, ఫొటోలు, వీడియోలను కలిగి ఉంటాయి. 2) థ్రెడ్స్ ఫీచర్లు ఏంటి..? ----> కొత్త థ్రెడ్స్ యాప్ మెటా ఫొటో-షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కి టెక్స్ట్- బేస్డ్ ప్రతిరూపంగా ఉంటుంది. ఇది రియల్-టైమ్ అప్‌డేట్స్, పబ్లిక్ కన్వర్జేషన్ల కోసం ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. కంపెనీ మీడియాకు అందించిన స్క్రీన్‌షాట్ల ప్రకారం యూజర్లు ట్విట్టర్ మాదిరిగానే థ్రెడ్స్ యాప్‌లో మైక్రోబ్లాగింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందుతారు. మొత్తం మీద మెటా ట్విట్టర్‌కు ప్రత్యక్ష సవాలుగా కనిపిస్తుంది. ఫొటో, వీడియో షేరింగ్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఎలా పని చేస్తుందో.. టెక్స్ట్, డైలాగ్‌ల షేరింగ్ విషయంలో థ్రెడ్స్ అలా పని చేసేలా రూపొందించారు. 3)థ్రెడ్స్ యాప్‌ను జుకర్‌బర్గ్ ట్విట్టర్ కిల్లర్ అని ఎందుకు పిలుస్తున్నారు? ----> థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేసే పోస్ట్‌లలో 500 అక్షరాల వరకు రాసుకోవచ్చు. ట్విట్టర్ 280-అక్షరాల లిమిట్‌తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు అని చెప్పవచ్చు. థ్రెడ్స్ యూజర్లు పోస్ట్‌ల్లో ఐదు నిమిషాల నిడివి గల వీడియోలతో పాటు లింక్స్, ఫొటోలు కూడా యాడ్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న యూజర్లు వారి ప్రస్తుత యూజర్‌నేమ్స్ ఉపయోగించి థ్రెడ్స్‌కి లాగిన్ కావచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయిన అకౌంట్స్‌నే థ్రెడ్స్‌లో కూడా ఫాలో కావచ్చు. ట్విట్టర్‌తో పోల్చితే థ్రెడ్స్‌ని యాక్సెస్ చేయడం చాలా ఈజీ. 4) గోప్యత పరంగా థ్రెడ్‌లను ఉపయోగించడం ఎంతవరకు సురక్షితం? ----> థ్రెడ్స్ యాప్‌ని ఉపయోగించడానికి, వినియోగదారులు వారి ఆరోగ్యం, ఫిట్‌నెస్, ఆర్థిక, కంటెంట్, బ్రౌజింగ్ హిస్టరీ, డేటా, లొకేషన్ మొదలైన వాటి గురించి సమాచారాన్ని అందించాలి. థ్రెడ్స్ ప్రైవసీ పాలసీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల లాగానే ఉంటుంది. డేటా గోప్యతకు సంబంధించినంతవరకు, ఇది ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కంటే చాలా సురక్షితం. ఇలా ఏ రకంగా చూసినా థ్రెడ్స్ ట్విట్టర్‌కు గట్టిపోటినిచ్చేలాగే కనిపిస్తోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి