కేసీఆర్ వ్యూహం ఏంటి.. కాంగ్రెస్‌తో కటీఫ్ అందుకేనా..

జూలై 17, 18 రెండు రోజుల పాటు బెంగళూరు వేదికగా జరిగిన విపక్షాల సమావేశానికి సీఎం కేసీఆర్ ఎందుకు దూరమయ్యారు..? కేసీఆర్‌కు ఆహ్వానం అందినా వెళ్లలేదా..? బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌తో సహా మిత్రపక్షాలు పిలువలేదా..? ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. గతంలో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో బీహార్‌లో జరిగిన సమావేశానికి సైతం బీఆర్ఎస్ దూరమైంది. ఆ సమావేశం ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయనే వార్తలకు చెక్ పడింది.

కేసీఆర్ వ్యూహం ఏంటి.. కాంగ్రెస్‌తో కటీఫ్ అందుకేనా..
New Update

What is KCR's strategy What is KCR's strategy

జూలై 17, 18 రెండు రోజుల పాటు బెంగళూరు వేదికగా జరిగిన విపక్షాల సమావేశానికి సీఎం కేసీఆర్ ఎందుకు దూరమయ్యారు..? కేసీఆర్‌కు ఆహ్వానం అందినా వెళ్లలేదా..? బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌తో సహా మిత్రపక్షాలు పిలువలేదా..? ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. గతంలో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో బీహార్‌లో జరిగిన సమావేశానికి సైతం బీఆర్ఎస్ దూరమైంది. ఆ సమావేశం ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయనే వార్తలకు చెక్ పడింది. బీఆర్‌ఎస్‌ను తాము కావాలనే పిలువలేదని కాంగ్రెస్ అంటే.. తామే కాంగ్రెస్ పార్టీ వస్తే తాము రామని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. దీంతో గతంలో విపక్షాల ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ బెంగళూరు సమావేశం ద్వారా కాంగ్రెస్‌తో దోస్తీకి కటీఫ్ చెప్పినట్లైంది.

కర్నాటక అసెబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కష్టమని ముందే భావించిన కేసీఆర్.. అందుకే కాంగ్రెస్ పార్టీతో దోస్తీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో గంతలో బీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్న రాజకీయ పంచాయతీ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిపోయింది. అందుకే బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలపై విరుచుకుపడకుండా.. కాంగ్రెస్ నేతలనే టార్గెట్ చేసుకుంటున్నారు. హస్తం పార్టీ నేతలు ఒక్కరు నోరు మెదిపినా గులాబీ నేతలు పది మాటలు అంటున్నారు. అంతే కాకుండా ఇటీవల రేవంత్ రెడ్డి విద్యుత్‌పై, సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు రాష్ట్రం అట్టుడికిపోయింది. ఇరు పార్టీలకు చెందిన నేతలు 119 నియోజకవర్గాల్లో పోటాపోటీగా ఆందోళనలు చేశారు.

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేతలు దగ్ధం చేస్తే.. బీఆర్‌ఎస్‌ నేతలు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్‌కు కటిఫ్ చేప్పిన కేసీఆర్.. బీజేపీతో చేతులు కలిపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీజేపీ నేతలు పదే పదే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేయగా.. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారు. దీంతోపాటు ఎమ్మెల్సీ కవితను ఓ సారి హైదరాబాద్‌లోని తన నివాసంలో, మరోసారి ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్‌లో విచారించిన అధికారులు.. ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రహస్య ఒప్పందం జరిగిందనే వాదన తెరపైకొస్తోంది.

దీంతో రానున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ బీజేపీతో కలిసి పని చేయబోతున్నాడని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా సీఎం కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ నేతలు ఎవరూ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిదానంగా ముందుకు వెళ్తున్నారు. కేసీఆర్‌ రానున్న ఎన్నికల్లో ప్రధాని అవుతారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేస్తున్నారని చెబుతున్నారు. మరి రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఏం చేస్తాడనేది చూడాలి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe