టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టుతో తర్వాత ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ప్రస్తుతం ఏసీపీ కోర్టులో వాడీవేడీగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? లేదంటే జైలు తప్పదా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. సీఐడీ రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ వేశారు. తన అరెస్టుపై చంద్రబాబే స్వయంగా వాదనలు వినిపించారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు మంత్రివర్గ నిర్ణయమని..ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకునే వీల్లేదన్నారు. 2021 డిసెంబర్ 9 నాటికి FIRలో తన పేరు లేదని చంద్రబాబు తెలిపారు.
ఇది కూడా చదవండి: చిక్కుల్లో లోకేశ్…రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు తనయుడి పేరు..!!
ఇది ఇలా ఉండగా...ఇప్పుడు చంద్రబాబునాయుడిపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 409పై చర్చ జరుగుతోంది. ఈ సెక్షన్ లో బాబుకు బెయిల్ వస్తుందా? రాదా అనే ఉత్కంఠ నెలకొంది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 ప్రకారం..ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ప్రజాసేవకులు వారిని మోసం చేసినట్లయితే ఈ నేరం కింద ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం ఎవరైనా ఏదైనా పద్దతిలో ఆస్తిని అప్పగించినా...లేదంటే పబ్లిక్ సర్వెంట్ హోదాలో లేదంటే బ్యాంకర్, వ్యాపారి, బ్రోకనర్, న్యాయవాదిగా అతని వ్యాపారంలో ఆస్తిపై ఏదైనా ఆదిపత్యం లేదంటే ఆ ఆస్తికి సంబంధించిన నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడితే..ఆ వ్యక్తికి జీవిత ఖైదు లేదంటే 10ఏళ్ల వరకు శిక్షను విధిస్తారు. శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు.
ఇది కూడా చదవండి: టీడీపీకి మరో షాక్..చర్చలకు నిరాకరించిన గవర్నర్..!!
ఐపీసీ 409 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి లేదంటే వారి వృత్తిలో ఆస్తిని అప్పగించిన వారు ఆ నమ్మకాన్ని ఉల్లంఘిస్తే..వారికి జీవిత ఖైదు లేదా పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన సెక్షన్లలో సెక్షన్ 409 ఉండటం వల్లే సీఐడీ పోలీసులు 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇవ్వకుండా చంద్రబాబును అరెస్టు చేశారు. అభియోగం మోపినంత మాత్రాన సరిపోదని..ఆ అరెస్టుకు గల కారణాలను కూడా వివరించాల్సి ఉంటుందని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు లబ్ది పొందినట్లు సీఐడీ అధారాలను చూపించాల్సి ఉంటుందన్నారు. సీఐడీ చంద్రబాబును కస్టడీకి ఇవ్వమని కోర్టును కోరితే..దానికి గల కారణాలను కూడా వివరించాల్సి ఉంటుందన్నారు.
ఇది కూడా చదవండి: అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన రిషి సునక్, భార్య అక్షతామూర్తి..!!
కాగా చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపించారు. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోర్టును కోరాు. ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. 409సెక్షన్ ఈ కేసులో పెట్టడం సరికాదని లుథ్రా వాదించారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్షాలు చూపించాలని లుథ్రా అన్నారు. రిమాండ్ రిపోర్టు తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు.