డెంగ్యూతో బ్రెయిన్ స్టోక్ వచ్చే అవకాశం!

డెంగ్యూ ప్రభావం మెదడు, నాడీ వ్యవస్థపై పడి ప్రాణాంతకమైన బ్రెయిన్ స్ట్రోక్‌లకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు, వికారం వంటి లక్షణాలు డెంగ్యూ వ్యాధి కారకాలని వారు పేర్కొంటున్నారు. డెంగ్యూ ప్రారంభ దశలోనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

New Update
డెంగ్యూతో బ్రెయిన్ స్టోక్ వచ్చే అవకాశం!

స్ట్రోక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ అనేది మీ మెదడులోని భాగానికి తగినంత రక్త ప్రసరణ లేనప్పుడు సంభవించే ప్రాణాంతక పరిస్థితి. ఇది సాధారణంగా  మెదడులో ధమని అడ్డుపడటం లేదా రక్తస్రావం కారణంగా జరుగుతుంది. సరైన మొత్తంలో రక్తం సరఫరా కాకపోతే, ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఆ ప్రదేశంలోని మెదడులోని కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి.

డెంగ్యూ షాక్‌ సిండ్రోమ్‌ గా పేర్కొనే ఈ సమస్య వల్ల తీవ్రమైన ప్లాస్మా లీకేజీ ఏర్పడుతుంది. దాని వల్ల మెదడు సహా కీలకమైన అవయవాలకు రక్త సరఫరా సరిగ్గా జరగదని, ఇలాంటి పరిస్థితుల్లోనే స్ట్రోక్‌ ముప్పు ఉంటుందని వెల్లడించారు. అంతే కాదు డెంగ్యూ వైరస్‌ కొన్నిసార్లు నరాల కణాలను ఆక్రమించి వాటి పనితీరును దెబ్బతీస్తుంది. మెదడు, వెన్నెముకలో వాపు ఏర్పడి కణజాలం దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.

పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా స్ట్రోక్ రావచ్చు, అయితే ఇతరులకన్నా ఎక్కువ ప్రమాదం ఉన్నవారు కొందరు ఉంటారు. అలాగే, 65 సంవత్సరాల వయస్సు తర్వాత దాని ప్రమాదం మరింతగా పెరుగుతుంది.స్ట్రోక్ ఎవరినైనా ప్రభావితం చేయగలిగినప్పటికీ, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులకు ఎక్కువ ప్రమాదం..

అధిక రక్త పోటు
అధిక కొలెస్ట్రాల్ (హైపర్లిపిడెమియా)
టైప్ 2 డయాబెటిస్
వారసత్వ అనారోగ్య చరిత్ర

ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలకు ప్రధాన కారణాలలో స్ట్రోక్ రెండవ స్థానంలో ఉంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా వైకల్యానికి స్ట్రోక్ కూడా ఒక ప్రధాన కారణం.



Advertisment
తాజా కథనాలు