ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు తింటే జరిగేది ఇదే!

ఖాళీ కడుపుతో అరటి పండు తింటే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. రాత్రి ఏమీ తినకుండా పొద్దున్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన ఖర్జూరం నీళ్ళు తాగితే కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు తింటే జరిగేది ఇదే!
New Update

ఆహారం విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆహారానికి సంబంధించి ఎప్పుడు ఏది తినాలి, ఎలా తినాలి అనేది తెలుసుకుని తినడం ఉత్తమం. ఇక ఖాళీ కడుపుతో ఉన్న సమయంలో కొన్ని కొన్ని తినడం మన ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు అరటి పండు తింటే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. రాత్రి ఏమీ తినకుండా పొద్దున్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన ఖర్జూరం నీళ్ళు తాగితే కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

చిన్న వయసు వారు కడుపు కాలీగా ఉంటే పాలు త్రాగితే అరుగుతాయి గాని… పెద్ద వయసు వచ్చాక త్రాగితే మాత్రం అరుగుదల సంగతి పక్కన పెట్టి… కడుపులో మంట మొదలవుతుంది. కడుపులో ఆకలిగా ఉండి టీ తాగడం కూడా ఎంత మాత్రం మంచిది కాదు. అదే విధంగా బాగా నీళ్ళు త్రాగి టీ తాగడం మంచిది కాదు. చింతపండు కూడా కాళీ కడుపుతో తింటే విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. పసుపు మరిగించిన నీళ్ళు త్రాగినా కాసేపు అన్నవాహిక తీవ్రంగా మండుతుంది.

ఆముదం కూడా ఖాళీ కడుపుతో తింటే ఇబ్బందులు వస్తాయి. శరీరంలో ఉప్పు స్థాయి తగ్గిపోతుంది. ఉప్పు నీళ్ళు కూడా ఖాళీ కడుపుతో తీసుకుంటే సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు అరటి కాయ కూర తినడం మంచిది కాదు. దుంపకూరలు ఉడికించుకుని తినవచ్చు గాని… కానీ ఖాళీ కడుపుతో తింటే మాత్రం శరీరంలో గ్లూకోజ్ లెవెల్ పడిపోతుంది. దుంప కూరలు త్వరగా అరిగే అవకాశం ఉండదు.

#health-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe