Bigg Boss Amardeep : మా అమ్మ, భార్యకు ఏదైనా జరిగి ఉంటే.. అమర్ దీప్ ఎమోషనల్ వీడియో..!

బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ కారు పై కొందరు ఫ్యాన్స్ దాడి చేశారు. దీని పై అమర్ స్పందిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. "అద్దాలు పగిలినప్పుడు.. గాజు పెంకులు మా అమ్మ, నా భార్య పై పడ్డాయి. ఒక వేళ రాళ్ళూ తలకు తగిలి ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటనీ ఎమోషనల్ అయ్యారు".

Bigg Boss Amardeep : మా అమ్మ, భార్యకు ఏదైనా జరిగి ఉంటే.. అమర్ దీప్ ఎమోషనల్ వీడియో..!
New Update

Bigg Boss Amardeep : కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Season - 7) విజేతగా నిలిచాడు. సీరియల్ నటుడు అమర్ దీప్(Amardeep) ను రన్నరప్ గా ప్రకటించారు. ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ముగిసిన అనంతరం అన్నపూర్ణ స్థూడియో ముందు ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. ఒకరి పై ఒకరు దాడులు చేసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంశం చేశారు. అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ల పై దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. ఫినాలే తర్వాత స్థూడియో నుంచి బయటకు వస్తున్న కంటెస్టెంట్స్ కార్ల పై కూడా దాడి చేశారు. రన్నరప్ అమర్ దీప్ కారు పై రాళ్ళూ విసురుతూ దాడి చేశారు. కారు అద్దాలను పగలగొట్టారు.. కారు లోపల ఉన్న అమర్ దీప్ భార్య, తల్లి భయంతో వణికిపోయారు. ఇప్పటికే ఈ ఘటన పై ఆర్టీసీ ఎం.డీ సజ్జనార్ సీరియస్ గా స్పందించారు. అభిమానం పేరుతో పిచ్చి చేష్టలు చేస్తే సహించేది లేదని తెలిపారు.

తాజాగా రన్నరప్ తన కారు పై రాళ్లతో దాడి చేసిన ఘటన పై స్పందిస్తూ.. ఒక వీడియోను రిలీజ్ చేశారు. "ఈ వీడియోలో అమర్ మాట్లాడుతూ.. నాకు సపోర్ట్ చేసినందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపాడు. కానీ బాధాకరమైన విషయమేంటంటే.. నా కారు అద్దాలు పగలగొట్టారు.. బయటకు రా.. నీ అంతు చూస్తా అని మాట్లాడారు.. చాలా భాదగా ఉంది. కారు అద్దాలు బ్రేక్ చేసినప్పుడు వాటి గాజు పెంకులు మా అమ్మ, నా భార్య పై పడ్డాయి. ఒక వేళ రాళ్ళూ తలకు తగిలి.. వాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటనీ భాదను వ్యక్తం చేశాడు. నేను ఒక్కడినే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. కానీ మన పక్కన ఒక భార్య, అమ్మ, చెల్లి ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది ఆలోచిస్తే బాగుండేదని నా అభిప్రాయం అంటూ  భాదపడ్డాడు. ఇలాంటివి ఇంకెవరికీ.. ఎప్పుడూ జరగకూడదని స్పందించారు. గెలిచి ఆనందంతో బయటకు వస్తాను అనుకున్నాను కానీ .. నన్ను..నా కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టారు.. చాలా బాధగా ఉందని వాపోయాడు. దేవుడి దయ.. నా అభిమానుల ప్రేమతో మా అమ్మ, నా భార్య క్షేమంగా ఉన్నారని ఎమోషనల్ అయ్యాడు." ఈ వీడియో చూసిన నెటిజన్లు అమర్ దీప్ కు  దైర్యం చెప్తూ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Bigg Boss 7 Telugu: దొరికిపోయిన యావర్, ప్రశాంత్.. వైరలవుతున్న వీడియో..!

#bigg-boss-7-telugu #amardeep-emotional-video
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe