Diabetes: మధుమేహం ఉన్నవారు వాకింగ్ చేస్తే ఏమవుతుంది..?

ఈ మధ్య కాలంలో చాలా మందిని మధుమేహ సమస్య భాదిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు కొన్ని జీవన శైలి అలవాట్లను మార్చుకుంటే చాలు. మధుమేహం ఉన్న వారు రోజూ వాకింగ్ చేస్తే ఒత్తిడి, బరువు, రక్తంలోని చక్కర స్థాయిలను నితంత్రించును.

New Update
 Diabetes: మధుమేహం ఉన్నవారు వాకింగ్ చేస్తే ఏమవుతుంది..?

 Diabetes: శరీరంలో ఇన్సులిన్ నిరోధకత రక్తంలోని చక్కర స్థాయిలను అధికంగా పెంచును. ఇది మధుమేహ సమస్యకు దారి తీయును. మధుమేహం ఒక దీర్ఘకాలిక వ్యాధి. ,మధుమేహ సమస్య శరీరంలో ఇతర అవయవాల పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆహారపు అలవాట్లు, అధిక బరువు, హెరిడీటీ, ఇన్సులిన్ నిరోధకత ఈ వ్యాధికి రావడానికి కారణమవుతాయి. మధుమేహ సమస్య ఉన్న వారు వాకింగ్ చేస్తే రక్తంలోని చక్కర స్థాయిలను నితంత్రించడానికి సహాయపడును.

మధుమేహం సమస్య ఉన్న వారు వాకింగ్ చేస్తే కలిగే లాభాలు

రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించును

మధుమేహం ఉన్నవారు ప్రతీ రోజు వాకింగ్ చేయడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడంతో పాటు శరీరంలోని కణాలు గ్లూకోజ్ సమర్థవంతంగా ఉపయోగించుకునేలా సహాయపడును. దీని వల్ల రక్తంలోని చక్కర స్థాయిలు నియంత్రనలో ఉంటాయి.

అధిక బరువును నియంత్రించును

ఉదయం లేవగానే వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రోజూ వాకింగ్ చేయడం ద్వారా శరీరంలో అధిక కొవ్వును కరిగించును. దీని వల్ల రక్తంలోని చక్కర స్థాయిలు కూడా కంట్రోల్ లో ఉంటాయి. అలాగే మధుమేహ సమస్య ఉన్న వారిలో ఊబకాయం వచ్చే ప్రమాదాన్ని తగ్గించును.

రక్త ప్రసరణను మెరుగుపరుచును

మధుమేహ సమస్య ఉన్నవారిలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉండడం చాలా ముఖ్యం. డయాబెటీస్ వ్యాధి కారణంగా రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది. కావున రోజు వాకింగ్ చేయడం ద్వారా రక్త ప్రవాహాన్ని పెంచి.. రక్త ప్రసరణను మెరుగుపరుచును.

ఒత్తిడిని తగ్గించును

ఏదైనా శారీరక శ్రమ ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలకు సహాయపడును. ఇది మన మనసును స్థిరంగా ఉంచడంతో పాటు రక్తంలోని చక్కర స్థాయిలను ప్రభావితం చేసే కార్టిసాల్ లెవెల్స్ ను తగ్గించును.

ఇన్సులిన్ ను పెంచును

ఇన్సులిన్ నిరోధకత కారణంగా శరీరంలోని కణాలు గ్లూకోజ్ సమర్థవంతంగా వినియోగించుకోలేవు. దీని వల్ల రక్తంలో చక్కర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది. కావున మధుమేహం సమస్య ఉన్న వారు రోజూ వాకింగ్ చేస్తే ఇన్సులిన్ శాతం పెరిగి.. గ్లూకోజ్ శోషణను మెరుగుపరుచును. ఇది మధుమేహన్ని నిర్వహించడంలో సహాయపడును.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Health Benefits : పుష్ప సినిమా రేంజ్‌లో కాలు మీద కాలు వేసుకుంటే ఇక అంతే

Advertisment
Advertisment
తాజా కథనాలు