Dreams : నిద్ర(Sleep) లో ఉన్నప్పుడు అనేక కలలు వస్తుంటాయి. అందులో కొన్ని మంచి కలలు ఉంటే మరికొన్ని పీడ కలలు ఉంటాయి. చాలా వరకు మనకు వచ్చే కలలను ఉదయానికి మర్చిపోతుంటాం. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని అంటుంటారు. కొన్ని కలలు అయితే మధ్యంతరంగా మర్చిపోతుంటాం. అయితే కొన్నిసార్లు చనిపోయినవారు, మనం మర్చిపోయిన వ్యక్తులు కూడా కలలో కనిపిస్తుంటారు.
విసిటేషన్ డ్రీమ్స్:
కలలు కొందరికి రంగు(Colors) ల్లో కనిపిస్తే మరికొందరికి బ్లాక్ అండ్ వైట్(Black & White) లో కనిపిస్తాయి. మరణించిన బంధువులు, స్నేహితులు కలలో కనిపిస్తే చాలా బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు భయం కూడా అనిపిస్తుంది. అనారోగ్యంతో చనిపోయినవారు కూడా కలలో ఆరోగ్యంగా కనిపిస్తారు. అలాగే యవ్వనంగా కనిపిస్తారు. ఇలా తెలిసినవాళ్లు కలలో కనిపిస్తే వాటిని విసిటేషన్ డ్రీమ్స్(Visitations Dreams) అంటారు. వీటికి మానసిక, ఆధ్యాత్మిక రీజన్స్ కూడా ఉంటాయి. మానసిక పరమైన కారణాలు 30శాతం ఉంటే ఆధ్యాత్మికానికి సంబంధించినవి 70శాతం ఉంటాయని చెబుతున్నారు.
ఆధ్యాత్మిక కారణం ఏంటంటే..
మానసిక కారణం ఏంటంటే బతికున్నప్పుడు వారితో ఎక్కువ రోజులు గడపలేదే, బాధపెట్టామే అని అనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక కారణం ఏంటంటే మరణించిన వారు కష్టాల్లో మనకు సాయపడతారు. మనల్ని దుష్టశక్తుల నుంచి కాపాడే ప్రయత్నం చేస్తారు. కొందరు మాత్రం పగ సాధించాలని చూస్తారని అంటున్నారు. ఇలాంటి కలలపై భయం వద్దని, కొన్ని ప్రమాదాల నుంచి హెచ్చరించడానికి కూడా కలలోకి వస్తారని పండితులు అంటున్నారు. ఒకే కల మూడుసార్లు వస్తే ఆధ్యాత్మికంగా చూస్తారని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో కలకలం.. గన్‌తో కాల్చుకున్న ఆర్‌ఎస్‌ఐ
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.