Dress Colour: ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం వరిస్తుందో తెలుసా!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం వేసుకునే బట్టల రంగును బట్టి అదృష్టం వరిస్తుందట. రోజుకొక రంగు బట్టలు వేసుకుంటే అదృష్టంతో పాటు గ్రహాల అనుగ్రహం కలిగి సంతోషంగా జీవిస్తారట. ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రంగు బట్టలు వేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

New Update
Dress Colour: ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం వరిస్తుందో తెలుసా!

Dress Colour: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మనకు ఏ సమస్య ఉన్న దాని పరిష్కారం దొరుకుతుంది. అలాంటి వాటిల్లో బట్టలు ఒకటి. అవును మనం వేసుకునే బట్టల రంగును బట్టి మన అదృష్టం, మన ఆరోగ్యం ముడిపడి ఉన్నదట. అంతేకాదు వారం రోజుల్లో ప్రతిరోజు ఒక్కో ఒకరకమైన రంగు బట్టలు వేసుకుంటే అదృష్టంతో పాటు గ్రహాల అనుగ్రహం కలిగి సంతోషంగా జీవిస్తామని పండితులు చెబుతున్నారు. కొంతమంది పండితులు మన పుట్టిన జాతకం, నక్షత్రం, తేదీలను బట్టి మన జీవితాన్ని అంచనా వేస్తారు. అలాగే మనం ఆదివారం నుంచి శనివారం వరకు వేసుకునే బట్టల రంగులు కూడా మనకి మంచి చేస్తాయట. మరి ఏ రోజూ ఏ రంగు బట్టలు వేసుకుంటే ఎలాంటి అదృష్టం కలుగుతుందో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

publive-image

ఏ రోజు ఏ రంగు బట్టలు వేసుకుంటే మంచిది:

  • ఆదివారం: ఈరోజు సూర్య భగవానుని అనుగ్రహం పొందాలంటే ఎరుపు రంగు బట్టలు వేసుకోవాలి. ఆదివారం గ్రహాల రాజు సూర్యుడికి చెందిన రోజు అంటారు. ఈ రోజూ ఎరుపు రంగు బట్టలు వేసుకుంటే సూర్యదేవుని తోపాటు అన్ని గ్రహాల ఆశీర్వాదం పొంది జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చిన సులభంగా పరిష్కారం అవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
  • సోమవారం: ఈరోజు తెల్లటి బట్టలు వేసుకుంటే మంచిది. ఈ రంగు బట్టలు చంద్రునికి ఎంతో ఇష్టం. కనుక తెల్లటి బట్టలు వేసుకుంటే మనుసు ప్రశాంతంగా ఉంటుంది.
  • మంగళవారం: ఈరోజు అంగారక అనుగ్రహం కలగాలంటే ఎరుపు రంగు బట్టలు వేసుకోవడం మంచిది. ఎరుపు రంగు బట్టలు వేసుకోవడం వల్ల జీవితంలో కలిగే ఇబ్బందులు నుంచి బయటపడటంతో పాటు హనుమంతుని ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి.
  • బుధవారం: ఈరోజు బుధ గ్రహం వాక్కుతో సంబంధం ఉంది. ఈ రోజున ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకుంటే ప్రయోజకరణంగా ఉంటుంది.
  • గురువారం: ఈరోజు పసుపు రంగు బట్టలు ధరించడం మంచిది. ఇలా వేసుకోవడం వల్ల బృహస్పతి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. బృహస్పతి అనుగ్రహం ఉంటే జీవితంలో డబ్బు కొరత ఉండదు.

publive-image

  • శుక్రవారం: ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. తల్లి లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఎరుపు లేదా తెలుపు రంగు దుస్తులు వేసుకుంటే అమ్మవారి అనుగ్రహంతో పాటు శుక్రుడి అనుగ్రహం పొందుతాం. ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి.
  • శనివారం: ఈరోజు శనీశ్వరుడికి ఇష్టమైన రోజు. శని దేవుడి అనుగ్రహం పొందాలంటే నీలం, ముదురు రంగు బట్టలు వేసుకోవచ్చు. నీలం బట్టలు వేసుకుంటే శని దేవుని అనుగ్రహం పొందవచ్చు. అయితే ముఖ్య విషయం ఏమిటంటే శనివారం రోజున నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకూడదని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: ఈ కూరగాయను తింటే శరీరంలో షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి!

Advertisment
Advertisment
తాజా కథనాలు