Covid New Variant: దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ కలకలం.. లక్షణాలివే!

ప్రపంచ దేశాలతోపాటు మనదేశంలోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు మరోసారి మనవాళిని భయపెడుతోంది. కోవిడ్ వేరియంట్ జేఎన్ 1 భారత్ లోనూ బయటపడటం కలకలం రేపుతోంది. 24గంటల్లో కొత్తగా 260 కేసులు నమోదు అవ్వగా...ఐదుగురు మృతి చెందారు. కేరళలో నలుగురు..యూపీలో మరొకరు మరణించారు.

Covid JN1 Variant : ఐసోలేషన్ లో ఉండాల్సిందే..కర్ణాటక గవర్నమెంట్ ఆర్డర్స్
New Update

దేశంలో కొత్త కరోనా వేరియంట్ టెన్షన్ పట్టుకుంది. జెఎన్ 1 వేరియంట్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దేశంలో అంతకంతకూ కేసులు పెరుగుతూనే ఉన్ాయి. ఈ వైరస్ సోకి కేరళలో నలుగురు మరణించగా..యూపీలో మరొకరు మరణించారు. కేరళలో జెఎన్ 1 వేరియంట్ సోకి 79 ఏళ్ల వృద్ధురాలు మరణించింది. దీంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని సూచించింది. పాజిటివ్ శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని లేఖ రాసింది. 60ఏళ్లు పై బడిన వారికి మాస్క్ తప్పనిసరి అని కర్నాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేరళ సరిహద్దులో బందోబస్తును పెంచిన కర్నాటక... కేసులు ఎక్కువైతే రాకపోకలు బంద్ చేస్తామని ప్రకటించింది. చలికాలం కావడంతో వైరస్ ను నియంత్రించడం కష్టం మారుతుందని వైద్యులు అంటున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక కేరళలో జేఎన్‌.1 వేరియంట్‌ వెలుగుచూడటంతో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు రాబోయే పండుగల సీజన్‌ దృష్ట్యా మాస్కులు ధరించాలని చెబుతున్నారు.

జెఎన్ 1 వేరియంట్ లక్షణాలు:

జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి.. కొందరిలో కడుపు నొప్పి, మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి నాలుగు నుంచి ఐదురోజుల సమయం పడుతుంది. గత వేరియెంట్‌లతో పోలిస్తే జేఎన్‌.1 ప్రమాదకరమైందని చెప్పడానికి ఇప్పటికైతే శాస్త్రీయ కారణాలు లేవు. పైగా ఆస్పత్రుల్లో చేరాల్సినంత అవసరమూ రాకపోవచ్చని వైద్యులు అంటున్నారు. కాబట్టి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. బదులుగా.. ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా చేతులు మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం లాంటివి చేయాలని సూచిస్తున్నారు.

అటు అమెరికా, చైనా తర్వాత భారత్ లో ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అమెరికాలో సెప్టెంబర్ లో మొదటి కేసు నమోదు అయ్యింది. ఈ వేరియంట్ ఇప్పటివరకు 11దేశాల్లో విస్తరించింది. కొత్త వేరియంట్ వ్యాప్తి వేగంగానే ఉంటుందని అమెరికా వెల్లడించింది.

అటు సింగపూర్‌లో కరోనా విజృంభిస్తోంది. మొత్తం 56 వేల కేసులు నమోదు అయ్యాయి. అదీ వారం వ్యవధిలోనే నమోదు కావడంతో మాస్క్‌ను తప్పనిసరి చేసింది ఆ దేశం. కేసులు పెరుగుతుంటే లాక్‌డౌన్‌ విధించే ఆలోచన చేస్తామని చెబుతోంది. మరోవైపు మలేషియాలోనూ 20వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఐతే ఈ రెండు దేశాల్లో వైరస్‌ వ్యాప్తికి జేఎన్‌.1 కారణమా? అనేది స్పష్టత రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి:  నిజామాబాద్ ఆరుగురి హత్యల్లో మరో ట్విస్ట్..ఏడో హత్య కూడానా?

#covid-19-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe