Body Seven Chakras: మన శరీరంలో సప్తచక్రాలు అంటే ఏంటి.. వాటిని ఎలా పొందవచ్చు..? మానవ శరీరంలో ఏడు శక్తి కేంద్రాలు ఉన్నాయి. చక్రాలు సమతుల్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. వీటి ద్వారా మనకు ప్రాణశక్తి ప్రవహిస్తుంది. కొన్నిసార్లు ఈ శక్తి మార్గాలు మూసుకుపోతాయి. ఈ ఆర్టికల్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోండి By Vijaya Nimma 13 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Body Seven Chakras: మానవ శరీరంలో ఏడు చక్రాలు లేదా శక్తి కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా మనకు ప్రాణశక్తి ప్రవహిస్తుంది. కొన్నిసార్లు ఈ శక్తి మార్గాలు మూసుకుపోతాయి. వీటివల్ల అనారోగ్యం, శరీరం సహజ ప్రక్రియలలో ఆటంకాలకు దారితీస్తుంది. ప్రతిచక్రం దేనిని సూచిస్తుందో, ఈ శక్తిని స్వేచ్ఛగా ప్రవహించడానికి ఏం చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చక్రాలు సమతుల్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. శరీరంలో సప్తచక్రాలు: సహస్ర చక్రం: ఇంగ్లీష్‌లో క్రౌన్‌చక్రం అంటారు. ఇది తల, మెదడుపై ఉంటుంది. ఇది క్రియాత్మకంగా లేకపోతే పార్కిన్సన్, స్కిజోఫేనియా, మూర్చలు, సినెల్ డిమెంత్రియా, అల్జీమర్ వ్యాధి, మానసిక రుగ్మతలు, గందరగోళం వస్తుంది. అజ్న చక్రం: ఇంగ్లీష్‌లో దబ్రోచక్రా అని అంటారు. ఇది నుదిటి మధ్యలో ఉంటుంది. ఇది ఏడు చక్రాల్లో రెండోది. అజ్నాచక్రం క్రియాత్మకంగా లేకపోతే ఒత్తిడి, తలనొప్పి, మైగ్రేన్, దృష్టి లోపం, గ్లూకోమా, క్యాటరాక్ట్, పొత్తికడుపు, చెవి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. విశుద్ధ చక్రం: ఈ చక్రం గొంతు, ఊపిరితిత్తుల దగ్గర ఉంటుంది. విశుద్ధ చక్రం సరిగా లేకపోతే థైరాయిడ్ సమస్యలు వస్తాయి. ఎక్కువగా లేదా తక్కువగా చురుగ్గా ఉండటం, ఆత్రుత, ఆస్తమా, ఊపిరితిత్తుల్లో నెమ్ము, వినికిడి, ధనుర్వాతం వంటి సమస్యలు ఏర్పడతాయి. దీనివల్ల జీర్ణవ్యవస్థ, నోటిపుండ్లు, గొంతులో పుండు, గొంతులో కాయలు ఏర్పడతాయి. అనాహత చక్రం: ఈ చక్రాన్ని గుండె చక్రం అని కూడా అంటారు. ఇది గుండెకు దగ్గర్లో ఉంటుంది. అనుహత చక్రం క్రియాత్మకం కానప్పుడు గుండె జబ్బులు, రోగనిరోధక శక్తికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. మయాల్జియా, ఎన్‌సిఫాలో మిల్లిటస్, కొన్ని సార్లు దీర్ఘకాలిక అలసటకు దారి తీస్తుంది. రోగనిరోధకశక్తి క్షీణించడం, అలర్జీలు, రొమ్ము క్యాన్సర్ రావొచ్చు. మణిపూర చక్రం: దీనిని సోలార్ ప్లెక్సెస్ చక్ర అని కూడా అంటారు. ఇది కాలేయం, ప్లీహం, పొట్టకు దగ్గర్లో ఉంటుంది. మణిపూర చక్రం క్రియాత్మకంగా లేకపోతే మధుమేహం, ప్యాంక్రియాటిస్, కాలేయ వ్యాధి, పెప్టిక్ అలర్స్, పురీష వ్యాధి, మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. స్వాదిష్టాన చక్రం: ఈ చక్రాన్ని సాక్రెల్‌చక్రం అంటారు. ఇది గర్భసంచి, ప్రొస్టేట్, గర్భాశయం, వృషణాలు ఉండే ప్రాంతంలో ఉంటుంది. స్వాదిష్టాన చక్రం క్రియాత్మకంగా లేకపోతే ముందస్తు రుతుస్రావ సమస్యలు, రుత స్రావంలో సమస్యలు, గర్భాశయంలో తిత్తులు, గర్భసంచిలో తిత్తులు, విరేచనం ఆపుకోలేకపోవడం, ఎండోమెట్రియోసిస్, వృషణాల వ్యాధి, ప్రొస్టేట్ వ్యాధి వస్తుంది. మూలాధార చక్రం: దీన్నే దబేస్‌చక్రం అంటారు. వెన్నుపాము దిగువన ఉంటుంది. మూలధార చక్రం క్రియాత్మకంగా లేకపోతే మలబద్ధకం, డయేరియా, పైల్స్, కాళ్లు, చేతి వేళ్లు చల్లబడటం, తరచుగా మూత్రానికి వెళ్లడం, హైపర్ టెన్షన్, మూత్రంలో రాళ్లు, లైంగిక పటుత్వం లేకపోవడం, పిరుదులకు సంబంధించిన సమస్యలు వస్తాయి. చక్రాలను ఎలా అన్‌లాక్ చేయాలి..? చక్రాలను అన్‌లాక్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే దీన్ని సాధించడానికి అనేక సంవత్సరాల లోతైన ధ్యాన అభ్యాసాలు అవసరం. ఈ పద్ధతులు ఆధ్యాత్మికత నుండి ఉద్భవించాయి. అన్‌లాక్ చేయాలనుకుంటున్న చక్రం గురించి ముందుగా తెలుసుకోవాలి. ప్రతి చక్రం దాని శక్తిని ఉపయోగించుకోవడానికి ప్రతిరోజూ ధ్యానం చేయండి. ఇది కూడా చదవండి: ఇలాంటి పెళ్లి మీరు ఎక్కడా చూసి ఉండరు.. ఏకంగా సూర్యుడితోనే గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #body-seven-chakras మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి