అర్జెంటీన్ గెలుపులో ఆ స్టార్ ప్లేయర్! కోపా 2024 అమెరికా ఫుట్‌బాల్ ఫైనల్‌లో కొలంబియా పై అర్జెంటీనా గెలుపొందటంలో స్టార్ ప్లేయర్ మార్టినెజ్ కీలకపాత్ర వహించాడు. మెస్సీ 63వనిమిషంలో చీలమండ నొప్పితో మైదానం వీడినా 112వనిమిషంలో మార్టినెజ్ సాధించిన గోల్ మ్యాచ్ ను మలుపు తిప్పింది.దీంతో అర్జెంటీనా కోపా 2024 కప్ గెలుచుకుంది. By Durga Rao 15 Jul 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి 2024 కోపా అమెరికా ఫుట్‌బాల్ సిరీస్ ఫైనల్‌లో అర్జెంటీనా, కొలంబియా జట్లు తలపడ్డాయి. అర్జెంటీనా జట్టు స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఈ మ్యాచ్‌లో ఒక్క గోల్ అయినా సాధిస్తాడని అభిమానులు ఆశించారు. అయితే మ్యాచ్ మధ్యలో చీలమండకు తీవ్ర గాయమైన సహాయం చేస్తూ, అతను ఆట కొనసాగించాడు. కానీ మెస్సీ కాలు బాగా వాచిపోవడంతో 63 వ నిమిషంలో మైదానం వీడాల్సివచ్చింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశచెందారు.ఈ మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. దీంతో 30 నిమిషాల అదనపు సమయం లభించింది. అర్జెంటీనా మరో స్టార్ ప్లేయర్ మార్టినెజ్‌ను 97వ నిమిషంలో రంగంలోకి దింపింది.అతడు 112వ నిమిషంలో గోల్ చేసి గేమ్‌ను మలుపు తిప్పాడు. దీంతో ఆట ముగిసే సమయానికి అర్జెంటీనా 1-0తో కొలంబియాపై విజయం సాధించింది. మార్టినెజ్ అర్జెంటీనా సూపర్ హీరో అయ్యాడు. సిరీస్‌లో మొత్తం ఐదు గోల్స్ చేసి గోల్డెన్ బూట్ అవార్డును గెలుచుకున్నాడు. అర్జెంటీనా కోపా అమెరికా ట్రోఫీని 16వ సారి గెలుచుకుని చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. అలాగే, అర్జెంటీనా జట్టు 2021 కోపా అమెరికా కప్, 2022 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2024 కోపా అమెరికా కప్ వంటి మూడు వరుస ప్రధాన సిరీస్‌లను గెలుచుకుంది. #messi #martinez మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి