WFI : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త టీమ్ సస్పెండ్.. ప్రకటించిన క్రీడా మంత్రిత్వ శాఖ సంజయ్ సింగ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన డబ్ల్యూఎఫ్‌ఐ (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) బాడీని భారత క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. పారదర్శకత, ఇతర సమస్యల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. By srinivas 24 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Sanjay Singh : సంజయ్ సింగ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన డబ్ల్యూఎఫ్‌ఐ బాడీని భారత క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. పారదర్శకత, ఇతర సమస్యల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నారు. కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సంజయ్ సింగ్ U-15, U-20 నేషనల్స్ గోండాలో జరుగుతాయని ప్రకటించిన వెంటనే మంత్రిత్వ శాఖ ఈ చర్యలు తీసుకుంది. ఈ మేరకు సంజయ్ సింగ్(Sanjay Singh) గురువారం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యుఎఫ్‌ఐ)కి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. యుపి రెజ్లింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సంజయ్ తన ప్రత్యర్థి అనితా షియోరాన్‌పై పోల్స్‌లో ఆధిపత్యం సాధించి మొత్తంగా 40 ఓట్లతో విజయం సాధించాడు. అనితా షియోరాన్ కేవలం ఏడు ఓట్లకు మాత్రమే సాధించగలిగారు. సంజయ్ సింగ్ నియామకంపై రెజ్లర్ల స్పందన : అయితే బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ వంటి రెజ్లర్‌లకు ఈ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి. ఎందుకంటే బ్రిజ్ భూషణ్‌పై తమ నిరసన కొనసాగుతుండగానే బ్రిజ్ స్నేహితుడైన బీజేపీ ఎంపి సంజయ్ మళ్లీ అధికారంలో రావడంతో గార్డు మార్పు కోసం క్రీడా మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలోనే రెజ్లర్ బజరంగ్ పునియా మాట్లాడుతూ.. 'బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌తో సంబంధం ఉన్న ఎవరినీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించబోమని కేంద్ర క్రీడా మంత్రి రికార్డులో చెప్పారు. WFI ఎన్నికలలో గెలిచిన వ్యక్తి బ్రిజ్ భూషణ్ సహాయకుడు. వారు ఇప్పుడు అతనిని కూడా కేసు నుండి రక్షిస్తారని అనుమానముంది. కానీ కోర్టులపై మాకు నమ్మకం ఉంది. అతను చట్టం ద్వారా శిక్షించబడతాడని ఆశిస్తున్నాం'అని తెలిపారు. ఇది కూడా చదవండి : CM Revanth: సీఎం రేవంత్ కీలక భేటీ.. ధరణి రద్దు, రైతు బంధు అంశాలపై కసరత్తు రెజ్లర్ సాక్షి మాలిక్ కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 'మేము మహిళా అధ్యక్షుడి కోసం డిమాండ్ చేసాం. అధ్యక్షురాలు మహిళ అయితే వేధింపులు జరగవు. కానీ ఇంతకుముందు మహిళల భాగస్వామ్యం లేదు. ఈ రోజు మీరు జాబితాను గమనిస్తే.. ఒక్క మహిళకు కూడా స్థానం ఇవ్వలేదు. మేము పూర్తి శక్తితో పోరాటం చేశాం. అయినా మా పోరాటం కొనసాగుతుంది. కొత్త తరానికి చెందిన మల్లయోధులు పోరాడాలి' అని ఆమె పిలుపునిచ్చారు. ఇంతకుముందు బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు WFI అధ్యక్షుడిగా ఎన్నికైనట్లయితే కుస్తీ పోటీనుంచి పూర్తిగా తప్పుకుంటానని సాక్షి మాలిక్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా 'మేము మహిళా అధ్యక్షురాలిని కోరుకున్నాం. కానీ అది జరగలేదు. బ్రిజ్ భూషణ్ విధేయులు ఎవరూ డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో పోటీ చేయరన్న మాటపై ప్రభుత్వం నిలబడకపోవడం దురదృష్టకరం' అని బజరంగ్ అన్నారు. #sanjay-singh #regling #suspends #new-team #wfi #sports-ministry మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి