సంజయ్ సింగ్(Sanjay singh) నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన WFI (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) బాడీని భారత క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పారదర్శకత, ఇతర సమస్యల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఎన్నికైన WFI చీఫ్ సంజయ్ సింగ్ U-15, U-20 నేషనల్స్ గోండాలో జరుగుతాయని ప్రకటించిన వెంటనే మంత్రిత్వ శాఖ ఈ చర్యలు తీసుకుంది. మరోవైపు రెజ్లర్లు సంజయ్ సింగ్ WFI చీఫ్ కావడం పట్ల ఇప్పటికే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో క్రీడా మంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయం వారిలో కాస్త ఆనందాన్ని ఇచ్చినట్టు అయ్యింది. ఇక జరుగుతున్న పరిణామాలపై WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ స్పందించారు. నిజానికి బ్రిజ్ భూషణ్‌కు సంజయ్ సింగ్ చాలా క్లోజ్. బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అతను బీజేపీ ఎంపీ కూడా. అతనికి శిక్ష పడాలని ఏడాది కాలంగా రెజ్లర్లు నిరసన చేస్తున్నారు.
నాకేం సంబంధం లేదు:
కొత్తగా ఎన్నికైన బోర్డును క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేయడంతో తనకు ఎలాంటి సంబంధం లేదని భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. భారత రెజ్లింగ్‌లోని తాజా పరిణామాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సస్పెన్షన్‌కు సంబంధించిన రిపోర్టును కూడా చూడలేదన్నాడు బ్రిజ్ భూషణ్. తన టీంతో చర్చించిన తర్వాతే దీనిపై స్పందిస్తానని తెలిపారు. రెజ్లింగ్ నుంచి తాను రిటైర్డ్ అయ్యానని చెప్పుకొచ్చారు. సస్పెన్షన్‌పై కొత్తగా ఎన్నికైన WFI సభ్యులు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రభుత్వంతో చర్చిస్తారో, కోర్టును ఆశ్రయిస్తారో WFI సభ్యుల నిర్ణయం ఉంటుందని.. దీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు బ్రిజ్.
'12 ఏళ్లుగా రెజ్లర్ల కోసం పనిచేశాను.. న్యాయం చేసిందో లేదో కాలమే సమాధానం చెబుతుంది.. కుస్తీ నుంచి పూర్తిగా రిటైర్ అయ్యాను.. కుస్తీతో తెగతెంపులు చేసుకున్నాను.. ఇకపై ప్రభుత్వంతో నిర్ణయాలు, చర్చలు ఫెడరేషన్‌లో ఎన్నుకోబడిన వ్యక్తులే చేస్తారు. ' అని బ్రిజ్ భూషణ్ సింగ్ ఆదివారం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో అన్నారు. నిజానికి భారత రెజ్లింగ్ సమాఖ్యలో కొనసాగుతున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నిరంకుశత్వం, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఈ ఏడాది(2023) ప్రారంభం నుంచి భారత రెజ్లర్లలో ఒక వర్గం నిరసనలు తెలుపుతోంది. బ్రిజ్ భూషణ్ మహిళా మల్లయోధులను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఉన్నాయి.
Also Read: ఈ అవార్డులు మాకొద్దు.. పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్న మరో టాప్ రెజ్లర్!
WATCH: