AUS vs WI : ఛాంపియన్ ను చావు దెబ్బతీసిన వెస్టిండీస్.. 36 ఏళ్ల తర్వాత తొలి విజయం

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ చారిత్రాత్మక విజయం సాధించింది. 36 ఏళ్ల తర్వాత గబ్బా వేదికలో తొలి టెస్టు విజయం నమోదు చేసి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై 27 ఏళ్ల తర్వాత విజయం రుచి చూసి ఈ సిరీస్ ను సమంగా పంచుకుంది.  

New Update
AUS vs WI : ఛాంపియన్ ను చావు దెబ్బతీసిన వెస్టిండీస్.. 36 ఏళ్ల తర్వాత తొలి విజయం

AUS vs WI : 2023 ఛాంపియన్ జట్టు ఆస్ట్రేలియా(Australia) కు వెస్టిండీస్(West Indies) జట్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఇరుజట్ల మధ్య హోరా హోరిగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్(Test Match) లో కంగారును మట్టి కరిపించిన కరీబియన్ టీమ్.. దాదాపు 36 ఏళ్ల తర్వాత గబ్బా(Gabba) లో తొలి టెస్టు విజయం నమోదు చేసి చరిత్ర సృష్టించింది.  అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై 27 ఏళ్ల తర్వాత విజయం రుచి చూసింది.

ఆసీస్ తొందరపాటు..
ఈ మేరకు బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన రెండో టెస్టులో  విండీస్‌ నిర్దేశించిన 216 పరుగుల లక్ష్య ఛేదనలో 207 పరుగులకే ఆస్ట్రేలియా టీమ్ చేతులెత్తేసింది. దీంతో విండీస్ చారిత్రాత్మక విజయ సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ 311 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆసీస్‌ 289/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. అయితే అప్పటికి క్రీజ్‌లో కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్ (64*) మంచి ఫామ్ లో ఉండగా.. చివరి వికెట్‌ పడే వరకూ ఆడితే మంచి స్కోర్ దక్కేది. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో విండీస్‌ను త్వరగా ఔట్‌ చేయాలనే ఉద్దేశంతో ఆసీస్‌ ఈ నిర్ణయం తీసుకుని బొక్కబోర్లా పడింది.

ఇది కూడా చదవండి : Balakrishna: బాలకృష్ణ ఇంట్లో 120 లగ్జరీ వాచీలు.. ధర చూసి ఖంగుతిన్న అధికారులు

చెలరేగిన జోసెఫ్‌..
రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ జట్టు 193 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 22 పరుగులతో కలిపి ఆసీస్‌కు ముందు 216 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో చిన్న లక్ష్యాన్ని సులభంగా చేధిస్తామనుకున్న ఆస్ట్రేలియాకు విండీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. పేసర్లకు స్వర్గధామమైన గబ్బా పిచ్‌ లో కరిబీయన్ బౌలర్లు చెలరేగిపోయారు. ఏ ఒక్క బ్యాట్స్ మెన్ ను క్రీజులో కుదురుకోనివ్వకుండా నిప్పలు చెరిగే బంతులు విసిరారు. షామార్‌ జోసెఫ్‌ (7/68) విజృంభించాడు. ట్రావిస్‌ హెడ్‌ డకౌట్‌, మిచెల్ మార్ష్‌ (10), అలెక్స్‌ కేరీ (2) ఎక్కువసేపు నిలవలేదు. మిచెల్ స్టార్క్‌ (21) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు. కమిన్స్‌ (2), నాథన్ లైయన్ (9) కూడా చేతులెత్తేశారు. ఓ వైపు క్రీజ్‌లో పాతుకు పోయిన స్మిత్‌కు లోయర్‌ ఆర్డర్‌ నుంచి సరైన మద్దతు లభించలేదు. అల్జారీ జోసెఫ్ (2/62), జస్టిన్‌ గ్రీవ్స్‌ (1/46) వికెట్లు తీసి విండీస్ కు ఘన విజయాన్ని అందించారు.

సిరీస్ సమం..
ఆస్ట్రేలియా బ్యాటర్లు ఖవాజా (10), మార్నస్‌ లబుషేన్ (5)ను త్వరగానే ఔట్‌ చేసిన విండీస్‌కు స్టీవ్ స్మిత్ (91 నాటౌట్‌), కామెరూన్ గ్రీన్ (42) అడ్డుగా నిలిచిన విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఇక రెండు టెస్టుల సిరీస్‌ను ఇరు జట్లు 1-1తో సమం చేశాయి. ప్లేయర్ ఆప్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులను విండీస్‌ ఆటగాడు షామార్‌ జోసెఫ్‌ దక్కించుకున్నాడు.

సచిన్ ప్రశంసలు..
ఇక విండీస్ విజయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్.. 'షమర్ జోసెఫ్ 7 వికెట్లు పడగొట్టడం టెస్ట్ క్రికెట్ మనుగడకు మరింత మేలు చేస్తుంది. ఇది టెస్టు చరిత్రలో ఒక హైలెట్ గా నిలిచిపోతుంది. ఇది నిజంగా సవాలు చేసే ఫార్మాట్. 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో వెస్టిండీస్‌కు చారిత్రాత్మక విజయం సాధించినందుకు కంగ్రాట్స్' అంటూ ప్రశంసలు కురిపించాడు.

Advertisment
తాజా కథనాలు