Justice Hima Bindu: జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను ఖండించారు పశ్చిమ గోదావరి జిల్లా గౌడ సమస్య సంఘం నాయకులు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu) పై ఏసీబీ కోర్టులో 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు జడ్జి హిమబిందు. న్యాయపరంగా తీర్పు ఇచ్చిన జడ్జిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా వస్తున్న పోస్ట్‌ల ను గుర్తించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే గౌడ, శెట్టిబలిజ, శ్రీశైన, ఈడిగ, యాత కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
కోర్టులలో జడ్జిలుగా బీసీ (BC)లు ఉండకూడదని గతంలో చంద్రబాబు అన్నారన్నారు. చంద్రబాబు చేసిన అవినీతి అక్రమాలపై బీసీ వర్గానికి చెందిన మహిళ హిమ బిందు చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించారని అన్నారు. జడ్జి హిమబిందుకోసం ఏమి తెలియని వారు సైతం ఎవరిదో ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి ఆమె హిమబిందుగా ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. జడ్జి హిమబిందు శెట్టిబలిజ గీత కులానికి వర్గానికి చెందిన మహిళ అని తెలిపారు. సోషల్ మీడియాలో మాత్రం టిడిపి (TDP) శ్రేణులు రాజ్యసభ సభ్యులు, అగ్నికుల క్షత్రియులు మోపిదేవి వెంకటరమణ మేనకోడలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కోర్టులలో న్యాయం జరగకపోతే కత్తి పట్టుకుని యుద్ధం చేయాలని చంద్రబాబు లాయర్ లూధ్రా వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Casse) లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు రాజకీయ దుమారం రేపుతోంది. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ నేతలు రోడుకెక్కారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ ధర్నాలు చేస్తున్నారు. వైసీపీ (YCP) ప్రభుత్వ తీరు పై మండిపడుతున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు. స్కిల్ స్కాంలో చంద్రబాబు ప్రమేయం లేదని నినదిస్తున్నారు. అటు చంద్రబాబు బెయిల్ పిటీషన్లను కోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. నారా లోకేశ్ ఢిల్లీలో ఉన్నారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్ట్ పై మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: అవినీతి కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు: జగన్